క్రీడాభూమి

ఫైట్ చేయకుండానే పతకం ఖాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 4: ఆస్ట్రేలియా బాక్సర్ తైలా రాబర్ట్‌సన్ ఇంకా కామనె్వల్త్ గేమ్స్‌లో రింగ్‌లోకి దిగలేదు. ఫైట్ చేయలేదు. కానీ, పతకాన్ని మాత్రం ఖాయం చేసుకుంది. మహిళల 51 కిలోల విభాగంలో పోటీదారులు తక్కువ మంది ఉండడం ఆమెకు కలిసొచ్చిన అంశం. దీనికితోడు గ్రూప్ దశలో బై లభించడంతో ఆమె రింగ్‌లో అడుగుప్టెకుండానే నేరుగా సెమీ ఫైనల్ చేరింది. గేమ్స్ నిబంధనల ప్రకారం బాక్సింగ్ విభాగంలో సెమీ ఫైనల్స్ చేరితే పతకం ఖాయమవుతుంది. సెమీస్‌లో నెగ్గితే, ఫైనల్ చేరి, స్వర్ణ, లేదా రజత పతకానికి పోటీపడతారు. ఈ దశలో ఓడిన ఇద్దరు బాక్సర్లకు కాంస్య పతకాలు లభిస్తాయి. దీని ప్రకారం తైలా కనీసం కాంస్యాన్ని అందుకోనుంది. అయితే, సెమీస్ నుంచే వెనుదిరగాలన్న ఆలోచనేదీ తనకు లేదని తైలా స్పష్టం చేసింది. ఫైనల్ చేరతానని, టైటిల్ పోరులోనూ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఇలావుంటే, మహిళల 51 కిలోల విభాగంలో భారత్ నుంచి ఎవరూ పోటీలో లేరు. మొత్తం మీద బాక్సింగ్‌లో భారత్ తరఫున మేరీ కోమ్‌సహా 12 మంది పతకాల వేటను కొనసాగిస్తారు. వారిలో 8 మంది పురుషులుకాగా, నలుగురు మహిళలు. బాడ్మింటన్, వెయట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌తోపాటు బాక్సింగ్‌లోనూ భారత్ పతకాల పంట పండిస్తుం దని అభిమానులు ఆశిస్తున్నారు. పలువురు సమర్థులు జట్టులో ఉన్నందున వారి అంచనాలు ఫలిస్తాయనే అనుకోవాలి.