క్రీడాభూమి

స్టార్ ఇండియా చేతికి మీడియా హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 5: టీవీ మాధ్యమాల్లో దిగ్గజమైన స్టార్ ఇండియా దాదాపు ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో భారత క్రికెట్ మీడియా హక్కులను దక్కించుకుంది. స్వదేశంలో వచ్చే ఐదేళ్ల వరకు అంటే 2023 సంవత్సరం వరకు నిర్వహించే అన్ని సిరీస్‌లను ప్రసారం చేసేందుకు వీలుగా గ్లోబల్ కన్‌సాలిడేటెడ్ రైట్స్ (జీసీఆర్)ను 6138.1 కోట్లు (దాదాపు 944 డాలర్లు)తో దక్కించుకుంది. ఈ వేలంలో స్టార్ ఇండియాతోపాటు సోనీ, రిలయన్స్ జియో సంస్థలు కూడా పోటీ పడ్డాయి. ఇప్పటికే ఐపీఎల్ హక్కులను 16,347 కోట్లు (2.55 బిలియన్‌లు)తో స్టార్ ఇండియా దక్కించుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఐసీసీ టోర్నమెంట్లు పురుషులు, మహిళలతోపాటు 50 ఓవర్ల ప్రపంచ కప్, టీ-20 ప్రపంచ కప్‌ల ప్రసార హక్కులను కూడా ఇదే సంస్థ దక్కించుకోవడంతో భారత్‌తోపాటు విదేశాల్లోనూ జరిగే ఆయా మ్యాచ్‌లను స్టార్ ఇండియా ద్వారానే ప్రసారం చేసే అవకాశం ఉంది.