క్రీడాభూమి

స్మిత్, బాన్‌క్రాఫ్ట్ బాటలోనే వార్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఏప్రిల్ 5: బాల్ ట్యాంపరింగ్ ఉదంతానికి బాధ్యులైన ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమపై పడిన నిషేధాన్ని సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే స్మిత్, బాన్‌క్రాప్ట్ సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. వీరి బాటలోనే డేవిడ్ వార్నర్ కూడా నిషేధంపై సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. టాంపరింగ్ వ్యూహకర్తలుగా భావిస్తున్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది.. నేరుగా టాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాప్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా 9 నెలల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై స్వతంత్ర కమిషన్ ముందు సవాలు చేసుకునేందుకు ఈ ముగ్గురికి అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈనెల 11 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో వార్నర్ ట్విట్టర్ ద్వారా సవాలు చేయబోనని పేర్కొన్నాడు. ‘క్రికెట్ ఆస్ట్రేలియా నాపై విధించిన శిక్షతో నేను ఏకీభవిస్తా. కేప్‌టౌన్ టెస్టులో నా చర్యలకు క్షమాపణలు. మంచి వ్యక్తిగా, సహచర ఆటగాడిగా, రోల్‌మోడల్‌గా మారేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తా’ అని వార్నర్ పేర్కొన్నాడు. తమ దేశ క్రికెట్ యాజమాన్యం తనపై విధించిన నిషేధాన్ని తాను సవాలు చేయడం లేదని, శిక్ష పూర్తయ్యాక ఇక్కడి ప్రజల మనసు గెలుచుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని ఆయన స్పష్టం చేశాడు. నిషేధం కారణంగా వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కావాల్సి వచ్చింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలను కేన్ విలియమ్‌సన్‌కు అందజేసిన ఆ ఫ్రాంచైజీ అతడి స్థానంలో అలెక్స్ హాలెస్ తీసుకుంది.