క్రీడాభూమి

వారెవా మీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కామనె్వల్త్ గేమ్స్‌లో పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. 2020లో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దం అవుతాను. నేషనల్ ఫెడరేషన్ నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. నా కోసం ఎంతో మంది కోచ్‌లు శ్రమించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 2010 కామనె్వల్త్ క్రీడల్లో సుశీల్ కుమార్ రెజ్లింగ్ బౌట్స్ చూశాను. దాదాపు అదే సమయంలో నేను వెయిట్‌లిఫ్టింగ్ ఫ్రాక్టీస్ మొదలుపెట్టాను. మొదట్లో, రెండు వైపులా బరువులు వేసిన బార్‌ను ఎలా ఎత్తాలో కూడా నాకు తెలియదు. చాలా కష్టం అనిపించేది. ఆ తర్వాతప్రాక్టీస్ సెషన్స్‌ను పెంచి, విజయాలు సాధించడం మొదలుపెట్టాను’.
*
గోల్డ్‌కోస్ట్, ఏప్రిల్ 5: ఈసారి కామనె్వల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని వెయిట్‌లిఫ్టర్ సయ్‌ఖోమ్ మీరాబాయ్ చాను అందించగా, అంతకు ముందు లిఫ్టర్ గురురాజా పుజారీ రజత పతకాన్ని కైవసం చేసుకోవడం ద్వారా పతకాల ఖాతాను తెరిచాడు. గురువారం జరిగిన మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో 23 ఏళ్ల మీరాబాయి కామనె్వల్త్ గేమ్స్ రికార్డులు సృష్టించింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో తిరుగులేని ప్రతిభను కనబరచిన ఆమె నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. స్నాచ్‌లో ఆమె మూడు ప్రయత్నాల్లో వరుసగా 80, 84, 86 కిలోల బరువునెత్తింది. కామనె్వల్త్, గేమ్స్ రికార్డులను సృష్టించింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ మొదటి ప్రయత్నంలో 103 కిలోల బరువునునెత్తింది. ఆతర్వాత 107 కిలోలకు పెంచింది. చివరి ప్రయత్నంలో ఏకంగా 110 కిలోలతో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆమె ఈ రెండు విభాగాల్లో కలిపి మొత్తం 196 కిలోల బరువును ఎత్తడం గమనార్హం. 2014 గ్లాస్గో కామనె్వల్త్‌లో రజత పతకం గెల్చుకున్న మీరాబాయి ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో రాణించింది. కాగా, మారిషస్‌కు చెందిన మారీ హనిట్రా రొల్యా లనవొసొవా మొత్తం 170 కేజీల బరువు ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, 155 కేజీలతో శ్రీలంకకు చెందిన లిఫ్టర్ దినుషా గోమ్స్ కాంస్య పతకాన్ని అందుకుంది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో రోల్యా రానైవోసోవా, దినుషా గోమ్స్ రెండు రౌండ్‌లకే పరిమితమయ్యారు.
చెమటోడ్చిన పుజారీ..
పురుషుల 56 కిలోల విభాగంలో గురురాజా పుజారీ పతకం కోసం చెమటోడ్చాడు. తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో రాణించాడు. అయితే, స్వర్ణాన్ని అందుకోలేకపోయాడు. రజత పతకంతో సంతృప్తి చెందినప్పటికీ, 21వ కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పట్టికను తెరిచాడు. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ ఖచ్చితంగా పతకాలు సాధిస్తుందని ముందుగానే ఊహించారు. అనుకున్న విధంగానే 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి, తొలి పతకాన్ని అందించాడు. మలేసియా వెయిట్‌లిఫ్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్ 261 కేజీల బరువును ఎత్తి స్వర్ణ పతకం సాధించగా, 248 కిలోలతో శ్రీలంక లిఫ్టర్ చతురంగ లక్మల్‌కు కాంస్య పతకం దక్కింది.
కర్నాటక తీర ప్రాంతంలోని కుందపురాకు చెందిన గురురాజా తొలుత రెజ్లర్‌గా కెరీర్ ప్రారభించాడు. అయితే, ఆతర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌వైపు దుష్టి మరల్చాడు. పవర్ లిఫ్టింగ్‌కు, ఆ తర్వాత అతను వెయిట్‌లిప్టింగ్‌కు మారాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో పోటీలు ప్రారంభమైన తొలి రోజు, గురువారం తన ఈవెంట్‌ను ముగించుకున్న తర్వాత గురురాజా విలేఖరులతో మాట్లాడుతూ ఈ పతకం తనకు అంత సులువుగా రాలేదని వ్యాఖ్యానించాడు. క్లీన్ అండ్ జెర్క్ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాన్నాడు. చివరిదైన మూడో ప్రయత్నానికి వెళ్లే ముందు లిఫ్టింగ్ బార్ చాలా బరువుగా ఉన్నట్టు తోచిందని పేర్కొన్నాడు. అయితే, ఆ సమయంలో కోచ్ తనకు ధైర్యం చెప్పాడని అన్నాడు. ‘ఈ చివరి లిఫ్ట్‌పైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీ కుటుంబం, దేశం నువ్వు పతకం తెస్తావని ఎంతో ఆశతో ఎదురుచుస్తున్నారు’ అని తనకు కర్తవ్యాన్ని గుర్తుచేశాడని గురురాజా తెలిపాడు. ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకొని తాను పతకం సాధించగలిగానని తెలిపాడు.

చిత్రం..21వ కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన గురురాజా