క్రీడాభూమి

మలేసియా ఓపెన్ బాడ్మింటన్ ఇంతనాన్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 10: మలేసియా ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రచానొక్ ఇంతనాన్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె తాయ్ జూ ఇంగ్‌ను 21-14, 21-15 తేడాతో నేరు సెట్లలో సులభంగా ఓడించింది. ఇటీవలే థాయిలాండ్ ఓపెన్, ఇండియన్ ఓపెన్ టోర్నీల్లో విజేతగా నిలిచిన ఇంతనాన్ మరోసారి సత్తా చాటింది. కెరీర్‌లో 13వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. డబుల్స్ విభాగంలో యు యాంగ్, తాంగ్ యవాంటింగ్ 21-11, 21-17 ఆధిక్యంతో జుంగ్ కైయుంగ్ యున్, షిన్ సియూంగ్ చాన్ జోడీని ఓడించి టైటిల్ అందుకున్నారు.
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు చెన్ లాంగ్ రన్నరప్ ట్రోఫీతోనే సంతృప్తి చెందాడు. రెండో ర్యాంక్ ఆటగాడు లీ చాంగ్ వెయ్ ఆదివారం నాటి ఫైనల్‌లో 21-13, 21-8 తేడాతో చెన్ లాంగ్‌ను ఓడించి టైటిల్ సాధించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను కిమ్ సారాంగ్, కిమ్ జీ జంగ్ గెల్చుకున్నారు. వీరు ఫైనల్‌లో చాయ్ బియావో, హాంగ్ వెయ్ జోడీని 21-19, 21-15 స్కోరుతో ఓడించారు. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో టాన్‌టొవీ అహ్మద్, లిలియానా నాట్సిర్ జోడీ 23-21, 13-21, 21-16 తేడాతో పెంగ్ సూన్ చాన్, లియో ఇంగ్ గో జోడీపై విజయం సాధించి టైటిల్ సాధించింది.