క్రీడాభూమి

గురి కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 8: కామనె్వల్త్ గేమ్స్ షూటింగ్‌లో భారత్ పతకాల వెట మొదలైంది. టీనేజ్ సంచలనం మనూ భాకర్ స్వర్ణ పతకాన్ని సాధిస్తే, హీనా సిద్ధు రజత పతకాన్ని అందుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఈ ఇద్దరు భారత షూటర్ల హవా కొనసాగింది. ఒకరితో ఒకరు పోటీపడుతూ ఇద్దరూ అద్వితీయ ప్రతిభ కనబరచారు. కామనె్వల్త్ రికార్డును బద్దలు కొడుతూ మనూ స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, హీనా రెండో స్థానంలో నిలిచింది. మనూ మొత్తం 240.9 పాయింట్లు సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. హీనా 234 పాయింట్లను తన ఖాతాలో వేసుకోగా, 214.9 పాయింట్లు సంపాదించిన ఆస్ట్రేలియా షూటర్ ఎలెనా గాలియాబొవిచ్‌కు కాంస్య పతకం లభించింది.
సంతోషంగా ఉంది..
కామనె్వల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించడం అనందంగా ఉందని, ఒకవైపు వైద్య విద్య కోసం ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ క్రీడల్లో పాల్గొనడం, పతకాన్ని సాధించడం తనకు సంతోషాన్నిచ్చిందని టీనేజ్ సంచలన షూటర్ మనూ భాకర్ అన్నది. హర్యానాలోని గొరియా గ్రామానికి చెందిన మనూ ఆదివారం స్వర్ణాన్ని సాధించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, కామనె్వల్త్ క్రీడల్లో మొదటి సారి స్వర్ణ పతకం గెల్చుకోవడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందని చెప్పింది. కాగా, రజత పతక గ్రహీత హీనా సిద్ధూ మాట్లాడుతూ ఫైనల్స్ వేళ్లే ముందు, ఫైనల్లో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది. చేతి వేలికి గాయంతో బాదపడుతున్నప్పటికీ సంబంధిత వైద్యుడి సలహా మేరకు శిక్షణను కోనాసాగించానని చెప్పింది. 2017లో చేతి వేలి గాయం కారణంగా ఇబ్బంది పడ్డానని తెలిపింది. గాయం తర్వాత షూటింగ్ చేస్తున్నపుడు తన వేలు వణికేదని అమె తెలిపింది. చేతి వేలికి చికిత్స చేయించుకున్న తర్వాత మళ్లీ పిస్టల్ గురిపెట్టగలుగుతున్నానని చెప్పింది. కామనె్వల్త్ క్రీడలో పతకం సాధించడం ఎంతో అనందంగా ఉందని తెలిపింది.

చిత్రం..మనూ భాకర్