క్రీడాభూమి

కుష్బీర్ చేజారిన పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 9: భారత రేస్ వాకర్ కుష్బీర్ కౌర్ కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ప్రత్యర్థులకు సవాళ్లను విసురుతూ ముందుకు సాగినప్పటికీ, చివరిలో అదే వేగాన్ని కొనసాగిచలేక, నాలుగో స్థానంతో పోటీని పూర్తి చేసింది. కొత్త గేమ్స్ రికార్డును సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్ట్రేలియా రేస్ వాకర్ జెమిమా మాంటెగ్ ఒక గంట, 32.50 నిమిషాల్లో గమ్యాన్ని చేరింది. న్యూజిలాండ్‌కు చెందిన అలానా బార్బర్ ఒక గంట, 34.18 నిమిషాలు, బెథాన్ డావిస్ (వేల్స్) ఒక గంట, 36.08 నిమిషాలతో వరుసగా రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. నాలుగో స్థానంలో నిలిచిన కుష్బీర్ రేస్‌ను ఒక గంట, 39.21 నిమిషాల్లో పూర్తి చేసింది. కాగా, ఈ పోటీల్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ సౌమ్య బేబీ రేస్‌ను పూర్తి చేయలేక, డిస్‌క్వాలిఫై అయ్యాడు.
మనీష్‌కు ఆరో స్థానం: పురుషుల 20 మీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ మనీష్ సింగ్‌కు ఆరో స్థానం లభించింది. అతను ఒక గంట, 22.22 నిమిషాల్లో గమ్యాన్ని చేరాడు. కాగా, ఒక గంట, 19.34 నిమిషాల్లోనే రేస్‌ను పూర్తి చేసిన ఆస్ట్రేలియాకు చెందిన డేన్ బిర్డ్ స్మిత్ కొత్త గేమ్స్ రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. టామ్ బోస్వర్త్ (ఇంగ్లాండ్/ ఒక గంట 19.38 నిమిషాలు), సామ్యూల్ ఇరెరీ గాథింబా (కెన్యా/ ఒగ గంట, 19.51 నిమిషాలు) రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. మనీష్‌కు ఆరో స్థానం దక్కితే, మరో భారత అథ్లెట్ ఇర్ఫాన్ కొలొథుమా థోండి ఒక గంట, 27.34 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకొని, 13వ స్థానంలో నిలిచాడు. కాగా, అటు మహిళలు, ఇటు పురుషుల విభాగాల్లో కొత్త గేమ్స్ రికార్డులు నెలకొనడం, ఈ రెండూ ఆసీస్ అథ్లెట్ల పేరిటే నమోదుకావడం విశేషం.

చిత్రం.. కుష్బీర్ కౌర్