క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో నైట్ రైడర్స్‌పై చెన్నై విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 10: చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఒక బంతి మిగిలి ఉండగా చెన్నై విజయాన్ని నమోదు చేసింది. శామ్ బిల్లింగ్స్, డ్వెయన్ బ్రే బ్యా టింగ్ ప్రతిభ చెన్నైని విజయపథంలో నడిపింది.
టాస్ గెలిచినప్పటికీ, ఛేజింగ్ సులభమన్న ఉద్దేశంతో చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. టాప్, మిడిల్ ఆర్డర్‌లో అందరూ పరుగుల వేటలో తడబడి వికెట్లు పారేసుకోవడంతో ఆ జట్టుకు భారీ స్కోరు కష్టంగా కనిపించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ లిన్ 22, రాబిన్ ఉతప్ప 29, పరుగులకే పెవిలియన్ చేరారు. ఒకానొక దశలో 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలవడంతో చెలరేగిపోయిన ఆండ్రూ రసెల్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరో వికెట్‌కు 76 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. దినేష్ కార్తీక్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద వెనుదిగాడు. కానీ, రసెల్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పరుగుల వేటను కొనసాగించాడు. టామ్ కూరెన్ (2 నాటౌట్)తో కలిసి అతను స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించాడు. మొత్తం మీద 20 ఓవర్లలో నైట్ రైడర్స్ 202 పరుగులు చేసింది. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన రసెల్ 36 బంతుల్లో 88 పరుగులు సాధించి, నాటౌట్‌గా నిలిచాడు. అతని స్కోరులో ఒక ఫోర్, 11 సిక్సర్లు ఉన్నాయి. రసెల్ వీరవిహారం నైట్ రైడర్స్‌ను ఆదుకుంది. చెన్నై ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ 39 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ తలా ఒక్కో వికెట్ పంచుకున్నారు.
ఓపెనర్ల విజృంభణ
నైట్ రైడర్స్‌ను ఓడించాలంటే, 203 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన పరిస్థితుల్లో, ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసే బాధ్యతను చెన్నై ఓపెనర్లు షేన్ వాట్సన్, అంబటి రాయుడు తీసుకున్నారు. వీరిద్దరూ ఎమాత్రం ఇబ్బంది లేకుండా నైట్ రైడర్స్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. మొదటి వికెట్‌కు 75 పరుగులు జోడించిన తర్వాత వాట్సన్ వెనుదిరిగాడు. 19 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 42 పరుగులు చేసిన అతను రింకూ సింగ్ క్యాచ్ పట్టగా టామ్ కూరెన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరో పది పరుగుల తర్వాత రాయుడు కూడా ఔటయ్యాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు శివమ్ మావీ క్యాచ్ అందుకోగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వెనుదిరిగిన అతను 26 బంతుల్లో 39 పరుగులు చేశాడు. నిలకడగా ఆడే ప్రయత్నం చేసిన సురేష్ రైనా (14), మహేంద్ర సింగ్ ధోనీ (25) ఎంతో సేపు తమ పోరాటాన్ని కొనసాగించలేకపోయా రు. సునీల్ నారైన్ బౌలింగ్‌లో వినియ్ కుమార్ క్యాచ్ పట్ట గా రైనా ఔటైతే, పీయూష్ చావ్లా బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు ధోనీ దొరికిపోయాడు. రవీంద్ర జడేజాతో కలిసి శామ్ బిల్లింగ్స్ స్కోరును వేగంగా ముందుకు దూకించాడు. అయతే, చేతిలో ఉన్న బంతుల కంటే చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో చెన్నై బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. మొత్తానికి చివరి రెండు ఓవర్లలో చెన్నై 27 పరుగుల దూరంలో నిలిచింది. టామ్ కూరెన్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ మొదటి బంతిలో బిల్లింగ్స్ సింగిల్ తీయగా, రెండో బంతిలో జడేజా కూడా సింగిల్స్ సాధించాడు. మూడో బంతిని భారీ సిక్సర్‌గా మలచిన బిల్లింగ్స్ ఆతర్వాతి బంతిలో రాబిన్ ఉతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతను 23 బంతులు ఎదుర్కొని, 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. ఐదో బంతిలో జడేజా, చివరి బంతిలో డ్వెయన్ బ్రేవో చెరొక సింగిల్ తీశారు. ఆ ఓవర్‌లో 10 పరుగులు లభించగా, చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమయ్యాయ. అత్యంత కీలకమైన ఆ ఓవర్‌ను వేసే బాధ్యత ప్రవీణ్ కుమార్‌కు లభించింది. అయతే, అతను మొదటి బంతిని నోబాల్ వేయగా, డ్వెయన్ బ్రేవో దానిని భారీ సిక్సర్‌గా కొట్టాడు. తర్వాతి బంతిలో బ్రేవో రెండు పరుగులు చేశాడు. రెండో బంతిలో ఒక పరుగు లభించింది. మూడో బంతిని వైడ్‌గా వేయడంతో, తిరిగి వేసిన మూడో బంతిలో జడేజా ఒక పరుగు చేశాడు. నాలుగో బంతిలో బ్రేవో కూడా సింగిల్‌తో సరిపుచ్చాడు. చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. ఐదో బంతిని జడేజా సిక్సర్‌గా మలచడంతో, చెన్నై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. జడేజా, బ్రేవో చెరి 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. తొలి మ్యాచ్‌లో ముంబయని ఓడించిన చెన్నై వరుసగా మరో విజయాన్ని నమోదు చేసింది.