క్రీడాభూమి

బంగారు హీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, ఏప్రిల్ 10: భారత ఏస్ షూటర్ హీనా సిధు కామనె్వల్త్ గేమ్స్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఈ పోటీల్లో ఆమెకు ఇది రెండో పతకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 16 ఏళ్ల యువ సంచలనం మనూ భాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, హీనాకు రజత పతకం లభించిన విషయం తెలిసిందే. ఆమె మొత్తం 38 పాయింట్లు సంపాదించి, తన ప్రత్యర్థులను వెనక్కు నెట్టేసి, అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ స్కోరులో రెండు ‘్ఫర్ఫెక్ట్ ఐవ్’ ఉన్నాయంటే, హీనా ఏ స్థాయిలో రాణించిందో ఊహించుకోవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా గలియబొవిచ్ 35 పాయింట్లతో రజత పతకాన్ని అందుకుంది. 25 పాయింట్లు సంపాదించిన మలేసియా షూటర్ ఆలియా అజాహరి కాంస్య పతకాన్ని స్వీకరించింది. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత షూటర్ అన్నూరాజ్ సింగ్ ఆరో స్థానంతో సంతృప్తి చెందింది. హీనాకు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇదే తొలి మేజర్ టైటిల్. చాలాకాలంగా ఆమె 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనే పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలను కైవసం చేసుకుంది. కాగా, ఎంతోకాలంగా కామనె్వల్త్ గేమ్స్‌లో 25 మీటర్ల ఈవెంట్‌లో పతకం సాధించేందుకు శ్రమిస్తున్నానని, తన కష్టానికి ఫలితం దక్కిందని హీనా చెప్పింది. తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, అధికారుల, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.