క్రీడాభూమి

చెన్నై ఫాన్స్‌కు బీసీసీఐ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొని మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఓడించిన కొన్ని గంటల్లోనే ఇక్కడ జరగాల్సిన తదుపరి మ్యాచ్‌లను వేరే కేంద్రానికి తరలించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో, దాని ప్రభావం ఐపీఎల్‌పైనా కూడా పడుతుందని బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఓఏ) అభిప్రాయపడింది. మంగళవారం నాటి మ్యాచ్‌కి ముందు పలువురు ఆందోళనకారులు స్టేడియం ఎదుట బైఠాయించగా, పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. స్టేడియాన్ని ధ్వంసం చేస్తామని, పిచ్‌ని తవ్వేస్తామని, మైదానంలోకి పాములను విడిచిపెడతామని పలురకాలుగా హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో, చెన్నైలో మ్యాచ్‌లో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లను మరో కేంద్రానికి మార్చాలని నిర్ణయించినట్టు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపాడు.
రేసులో విశాఖ!
చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో కేంద్రానికి మార్చాలని నిర్ణయించినట్టు బీసీసీఐ ప్రకటించిన వెంటనే, ఆ అవకాశాన్ని దక్కించుకోవడానికి పోటీ పెరిగింది. ఈ రేసులో విశాఖపట్నం ముందున్నదని సమాచారం. విశాఖసహా బీసీసీఐ మొత్తం నాలుగు కేంద్రాల పేర్లను పరిశీలిస్తున్నది. తిరువనంతపురం, పుణే, రాజ్‌కోట్ నగరాలు కూడా మ్యాచ్‌ల నిర్వాహణకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. అయితే, అన్ని కోణాల్లోనూ చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీసీసీఐ ఒక తెలిపింది.