క్రీడాభూమి

2022 కామనె్వల్త్ గేమ్స్‌ను బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: బర్మింగ్‌హామ్‌లో 2022 సంవత్సరంలో నిర్వహించే తదుపరి కామనె్వల్త్ గేమ్స్‌లో షూటింగ్ అంశాన్ని పునరుద్ధరించకుంటే ఆ పోటీలను భారత్ బహిష్కరించాలని జాతీయ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ పిలుపునిచ్చాడు. మంగళవారం ఇక్కడ భారత షూటర్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తదుపరి కామనె్వల్త్ గేమ్స్‌లో షూటింగ్‌ను చేర్చకుంటే మొత్తం క్రీడలనే బహిష్కరించాలని కోరుతూ ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్‌తోపాటు భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు వేర్వేరు లేఖల ద్వారా విజ్ఞప్తి చేయనున్నట్టు పేర్కొన్నాడు.
2022 సంవత్సరంలో బర్మింగ్‌హామ్‌లో నిర్వహించే కామనె్వల్త్ గేమ్స్‌లో కొన్ని కారణాల వల్ల షూటింగ్ అంశాన్ని చేర్చే అవకాశం లేదని ఈ ఏడాది ప్రథమార్ధంలో కామనె్వల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ గ్రెవెంబర్గ్ స్పష్టం చేసిన విషయాన్ని రణీందర్ సింగ్ గుర్తు చేశాడు. 1966 నుంచి జరుగుతున్న అన్ని కామనె్వల్త్ గేమ్స్‌లో (1970లో ఈడెన్‌బర్గ్‌లో షూటింగ్ అంశం లేదు) షూటింగ్ అంశం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నాడు.