క్రీడాభూమి

నా ప్రస్థానం ఆగలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: తాను కెరీర్‌ను కొనసాగిస్తునే ఉన్నానని, ప్రస్థానం ఎక్కడా ఆగలేదని భారత ఏస్ షూటర్ తేజశ్విని సావంత్ స్పష్టం చేసింది. కొంతకాలం విరామం తర్వాత, ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడమేగాక, కొత్త గేమ్స్ రికార్డును కూడా నెలకొల్పిన తేజశ్విని రెండో ఇన్నింగ్స్ గొప్పగా ప్రారంభమైందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, కామనె్వల్త్ గేమ్స్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో పతకాన్ని కైవసం చేసుకోవడాన్ని తాను పునరాగమనంగా భావించడం లేదని తేజశ్విని అన్నది. నిజానికి తాను కొంత కాలం విశ్రాంతి తీసుకున్నానే తప్ప కెరీర్‌కు ఎక్కడా ఫుల్‌స్టాప్ పెట్టలేదని వ్యాఖ్యానించింది. 2014లో కుటుంబ పరమైన కొన్ని సమస్యల కారణంగా తాను కామనె్వల్త్ గేమ్స్‌కు ఎంపిక కాలేకపోయానని చెప్పింది. పనుల ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో తాను అప్పుడు తన ప్రదర్శన పేలవంగా ఉండిందని, అందుకే, కామనె్వల్త్ ప్రమాణాలను అందుకోలేకపోయానని వివరించింది. 2006 మెల్బోర్న్ కామనె్వల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్లఎయిర్ రైఫిల్ సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకున్న తేజశ్విని ఆతర్వాత అవనీత్ కౌర్ సిద్ధుతో కలిసి డబుల్స్ విభాగంలోనూ పతకాన్ని సాధించింది. 2010 ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని అందుకుంది. భారత్‌కు ఈమెగా ఈవెంట్‌లో స్వర్ణాన్ని సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుటల్లో చోటు సంపాదించింది. నాలుగేళ్ల క్రితం, ఎనిమిదేళ్ల క్రితం, ఢిల్లీలో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లోనూ తేజశ్విని పోడియం ఫినిష్ చేసింది. మహిళల 50 మీటర్ల ప్రోన్ సింగిల్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న ఆమె, పెయిర్స్ విభాగంలో మీనా కుమారి జోడీగా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అదే దూకుడును కొనసాగిస్తూ, మహిళల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ ఈవెంట్ పెయిర్స్‌లో లజ్జాకుమారి గోస్వామీ భాగస్వామిగా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన ఆమె తాను రెండో ఇన్నింగ్స్ ప్రారంభించానని వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టింది. నిజానికి తన కెరీర్ నిరాటంకంగా కొనసాగుతునే ఉందని, ఒక్కోసారి ఒడిదుడుకులు ఎవరికైనా తప్పవని వ్యాఖ్యానించింది. త్వరలోనే జరగబోయే ఆసియా క్రీడల్లోనూ రాణించడం ద్వారా 2020 ఒలింపిక్స్‌కు పూర్తిగా సన్నద్ధమవుతాయనని చెప్పింది. ఒక రకంగా ఒలింపిక్స్‌కు కామనె్వల్త్, ఆసియా క్రీడలను ప్రాక్టీస్ ఈవెంట్స్‌గా పేర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. కోచ్ కుహెలీ గంగూలీ మార్గదర్శకంలో తాను ఎన్నో మెళకువలు నేర్చుకుంటున్నానని, ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలుస్తాననే ధైర్యం తనకు ఉందని చెప్పింది.

చిత్రం..తేజశ్విని సావంత్