క్రీడాభూమి

అర్జున అవార్డుకు మానికా పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు టేబుల్ టెన్నిస్ స్టార్ మానికా బాత్రా పేరును అఖిల భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) ప్రతిపాదించింది. ఇటీవల గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో 22 ఏళ్ల మానికనాలుగు పతకాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రియో ఒలింపిక్ చాంపియన్ ఫెంగ్ తియాన్‌వెయ్‌ని ఆమె రెండు సార్లు ఓడించి సంచలనం సృష్టించింది. అద్వితీయ ప్రతిభాపాటవాలు కనబరచి, భారత్ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన మానికా బాత్రా అర్జున అవార్డుకు అన్నివిధాల అర్హురాలని ఒక ప్రకటనలో తెలిపింది.