క్రీడాభూమి

‘పెళ్లి’...రూమరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 23: కన్నడ నటి తనిష్కా కపూర్, తాను మంచి స్నేహితులమని, తమ పెళ్లి జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అసత్యమని టీమిండియా యువ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ స్పష్టం చేశాడు. తనిష్కాతో తన పెళ్లి అని ప్రచారమవుతున్న కథనాలపై యువ క్రికెటర్ స్పందించాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతనిధ్యం వహిస్తున్న చాహల్ త్వరలోనే కన్నడ నటి తనిష్కా కపూర్‌ను వివాహం చేసుకోనున్నట్లు వస్తున్న కథనాలు గత కొన్ని రోజుల నుండి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చాడు. ‘నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా. పెళ్లి రూమర్లను ఆపేయండి, నా పెళ్లికి సంబంధించి అర్థం లేని పోస్టులు చేయకండి’ అని ట్విటర్ ద్వారా అభిమానులు, శ్రేయోభిలాషులను కోరాడు.