క్రీడాభూమి

కామన్వెల్త్ పతక విజేతల అవార్డుల ఫంక్షన్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీఘర్, ఏప్రిల్ 25: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన పలువురు క్రీడాకారులకు గురువారం నిర్వహించబోయే అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రైజ్ మనీలో కోత విధించాలన్న ప్రతిపాదనల మేరకు సీనియర్ అథ్లెట్లు వినేష్ ఫొగట్ (రెజ్లర్), నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోయర్), మనోజ్ కుమార్ (బాక్సర్) అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయాన్ని వెల్లడించింది. వాస్తవానికి ఈ కార్యక్రమం పంచకులలో గురువారం జరగనుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో వినేష్ ఫొగట్, నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్స్ సాధించగా, మనోజ్ కుమార్ రజత పతకం అందుకున్నాడు. స్వరాష్ట్రం నుంచి వివిధ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సరైన విధంగా గౌరవించడం, సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని హర్యానా క్రీడల శాఖ మంత్రి అనిల్ విజ్ పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. కామన్వెల్త్ లో వివిధ పతకాలు సాధించిన తమ రాష్ట్ర అథ్లెట్లకు ప్రైజ్ మనీలో కోత అంశంపై ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఒక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుత క్రీడా నిబంధనల ప్రకారం రైల్వే, ఆర్మీ సర్వీస్‌లకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు ప్రైజ్ మనీ ఇచ్చే అవకాశం లేదని ఆయన పేర్కొన్నాడు. ఇదే కోవలోకి ఫొగట్ (రైల్వే), చోప్రా (సర్వీసెస్) వస్తారని, కానీ మిగతా క్రీడాకారులకు ఎక్కువ ప్రైజ్ మనీ ఇస్తూ తమకు మాత్రం కోత విధించారన్న అథ్లెట్ల ఆరోపణలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తామని క్రీడల మంత్రి స్పష్టం చేశాడు. ఇప్పటికే తమ ప్రభుత్వం వివిధ పతకాలు సాధించిన 22 మంది క్రీడాకారులను సత్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక పారితోషికం అందజేస్తోందని అన్నాడు. ఇదిలావుండగా, హర్యానా రాష్ట్ర క్రీడా నిబంధనల ప్రకారం కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి కోటిన్నర రూపాయలు, సిల్వర్ మెడల్ విజేతకు 75 లక్షలు, రజత పతక విజేతకు 50 లక్షలు అందజేయాల్సి ఉంటుంది.