క్రీడాభూమి

నైపుణ్యంతోనే డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: క్రికెట్‌లో మంచి నైపుణ్యం కలిగిన క్రికెటర్ల డిమాండ్ ఉంటుందని భారత మాజీ టెస్టు బ్యాట్స్‌మన్, ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ముంబయి జట్టులో హార్థిక పాండ్య, కృణాల్ పాండ్య వంటివారు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో రాణిస్తున్నారని ఆయన ప్రస్తుతించాడు. బ్యాట్స్‌మన్ అనేవాడు ఒకపక్క బ్యాటింగ్‌లో, మరోపక్క బౌలింగ్‌లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ రెండు లక్షణాలు పాండ్య సోదరుల్లో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇలాంటి యువ క్రికెటర్లు ఫార్మట్ ఏదైనా అన్నింటా రాణించడం చాలా అరుదని, అలాంటివారికే భవిష్యత్‌లో అపార అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నాడు. బుధవారం ఇక్కడ ‘ప్రో స్టార్ లీగ్ మెంటర్‌షిప్ క్యాంప్’ ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఫీల్డింగ్‌లో ఎదురవుతున్న కొత్త విధానాలను పుణికిపుచ్చుకోవడం ప్రతి క్రికెటర్ లక్ష్యం కావాలని, ఈ దిశగా దూసుకుపోవాలని ఆయన యువ క్రికెటర్లకు సూచించాడు. బౌలర్‌గా వ్యవహరించినపుడు ఫీల్డింగ్‌లో మంచి ఆటతీరును కనబరచాలని, అదే బ్యాటింగ్ చేస్తున్నపుడు వికెట్ల పరుగులు ఎక్కువగా తీయడానికి ప్రయత్నించాలని అన్నాడు. మంచి అర్హత, నైపుణ్యం కలిగిన కోచ్‌ల అవసరం ఎంతైనా ఉందని, కిందిస్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డాడు.