క్రీడాభూమి

మళ్లీ జూలు విదిల్చిన డివిలియర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 25: బెంగళూరు జట్టు క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మళ్లీ జూలు విదిల్చాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 90 పరుగులు చేసి జట్టును గెలిపించిన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ సరైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను జట్టులో అత్యధికంగా 68 పరుగులు చేశాడు.
తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్‌ను ఎంచుకుంది. ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మంచి శుభారంభం అందించినా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. డికాక్ 37 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఒక బౌండరీతో 53 పరుగులు చేసి డీజే బ్రేవో బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. కోహ్లీ 15 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 18 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 30 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ ఎనిమిది సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 68 పరుగులు చేసి తాహీర్ బౌలింగ్‌లో బిల్లింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కారే ఆండ్రర్సన్ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి తాహీర్ బౌలింగ్‌లో హర్బజన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 17 బంతులు ఎదుర్కొన్న మన్‌దీప్ సింగ్ మూడు సిక్సర్లు, ఒక బౌండరీ సహాయంతో 32 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు దొరికిపోయాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. పవన్ నేగి ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే డీజే బ్రేవో బౌలింగ్‌లో బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న వాషింగ్టన్ సుందర్ ఒక సిక్సర్, మరో బౌండరీ సహాయంతో 13 పరుగులతో, మహ్మద్ సిరాజ్ పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో శార్ధూర్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 46 పరుగులిచ్చి రెండు, ఇమ్రాన్ తాహీర్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి రెండు, డ్వేన్ బ్రేవో నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం 206 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 12 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఏడు పరుగులు చేసి నేగి బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. సురేష్ రైనా తొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 11 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో మన్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. శామ్ బిల్లింగ్స్ ఏడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో తొమ్మిది పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో డికాక్ చేతిలో స్టంపవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా ఐదు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు.

చిత్రం..బెంగళూరు జట్టులో మళ్లీ చక్కని ఇన్నింగ్స్ (68) ఆడిన డివిలియర్స్