క్రీడాభూమి

ఢిల్లీ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, ఏప్రిల్ 27: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-11లో భాగంగా ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 55 పరుగులతేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి జట్టు రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో రాణించి కేవలం 40 బంతుల్లో పది సిక్సర్లు, మూడు ఫోర్ల సహాయంతో 93 పరుగులు చేసి అజేయంగా నిలువగా అతి పిన్న వయసు కలిగిన యువ బ్యాట్స్‌మన్, జట్టు ఓపెనర్ పృథ్వీ షా 44 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ మన్రో 33 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 27 పరుగులు చేసి రనౌట్ ఆయ్యాడు. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగడంతో, మ్యాచ్ గెలిచే ఆవకాశాలు ఢిల్లీకే దక్కవచ్చని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
220 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్‌లు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువకపోడంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. 19 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. తిరిగి రెండో వికెట్ 20, మూడో వికెట్ 33, నాలుగో వికెట్ 46, ఐదో వికెట్ 77 పరుగుల వద్ద కోల్పోయి నైట్ రైడర్స్ కష్టాల్లో పడింది. 15ఓవర్లు ముగిసే సరికి రైడర్స్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లు చక్కటి బౌలింగ్‌ను ప్రధర్శించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది.