క్రీడాభూమి

కాంస్యం ఖాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా): భారత స్టార్ షట్లర్, కామనె్వల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు సైనా నెహ్వాల్ ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకొంది. ఈ మేరకు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిపై గెలుపొంది కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం మహిళల విభాగంలో జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సైనా 21-15, 21-13 స్కోరు తేడాతో ప్రత్యర్థి కొరియాకు చెందిన లీ జాంగ్ మిపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో సైనా పతకాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. అత్యుత్తమ కెరీర్‌ను కనబరుస్తున్న సైనా ఈ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం గెలిస్తే ఐదు సంవత్సరాల నిరీక్షణకు తెరపడనుంది. ఇప్పటి వరకు ఈ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ టైటిల్‌ను సాధించలేదు. మరో క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్టు, భారత షట్లర్ పీవీ.సింధు 19-21, 10-21 స్కోరు తేడాతో ప్రత్యర్థి కొరియాకు చెంది న సుంగ్ జీ హున్ చేతిలో ఓటమి పాలై ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ 12-21, 15-21 స్కోరు తేడాతో మలేసియాకు చెందిన లీ చోంగ్ వీ చేతిలో ఓడిపోయాడు.