క్రీడాభూమి

మ్యాచ్‌ల తరలింపు చాలా కష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 13: మహారాష్ట్ర నుంచి 13 ఐపిఎల్ మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించడం చాలా కష్టమని బిసిసిఐ స్పష్టం చేసింది. లోక్‌సత్తా మూమెంట్ ఎన్జీవో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వాజ్యంపై ఇరు వర్గాల వాదనలు విన్నతర్వాత, ఈనెల 30 తర్వాత జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందిస్తూ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నాడు. ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వాహణ ఆషామాషీ వ్యవహారం కాదన్నాడు. ఎంతో కష్టపడి సన్నాహాలు పూర్తి చేసిన తర్వాత, ఇప్పుడు హడావుడిగా వేదికలను మార్చడం అనుకున్నంత సులవు కాదన్నాడు. కోర్టు ఉత్తర్వుల కాపీ తమకు ఇంకా అందలేదని చెప్పాడు. వాటిని అందుకున్న తర్వాతే తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామన్నాడు.
ఐపిఎల్‌ను లక్ష్యంగా చేసుకొని, పరోక్ష దాడులకు పాల్పడుతున్నారని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆరోపించాడు. మ్యాచ్‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కొత్త ప్రాంతాల్లో నిర్వహించడం కష్టమవుతుందని అన్నాడు. ఐపిఎల్‌పై వ్యతిరేక ఏర్పడాలన్న ఉద్దేశంతో కొన్ని శక్తులు ఈ విధంగా కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మైదానంలో పచ్చికను తడిపేందుకు మంచినీటిని వాడడం లేదని స్పష్టం చేశాడు. పైగా ఐపిఎల్‌కు వాడేది మహారాష్ట్ర నీటి వాడంలో 0.00038 శాతం మాత్రమేనని అన్నాడు. ఐదు నక్షత్రాల హోటళ్లు, పెద్దపెద్ద భవంతుల్లోని లాన్స్‌కు నీరు అందించకుండా ఎండబెడుతున్నారా? అని ప్రశ్నించాడు.