క్రీడాభూమి

మరో గెలుపుపై చెన్నై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 2: ప్రస్తుత ఐపీఎల్‌లో ఆడుతున్న ఎనిమిది జట్లలో అద్భుతమైన ఆటతీరుతో ప్రథమ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో గెలుపు కోసం సన్నద్ధం అవుతోంది. గురువారం కోల్‌కతా స్టేడియంలో కోల్‌కతా జట్టుతో తలపడనుంది. ఇంతవరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి, మరో రెండింట్లో ఓటమిని చవిచూసి, 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఎనిమిది జట్లలో నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా ఇంతవరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించి, మరో నాలుగింట్లో ఓటమిపాలైన కోల్‌కతా ఎనిమిది పాయింట్లు సాధించింది. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తను అద్భుత ఆటతీరుతో జట్టును విజయవంతంగా ముందుకు దూసుకువెళ్తున్నాడు. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు, తద్వారా గెలుపు కోసం టీమ్ సభ్యులందర్నీ ఉద్యుక్తులను చేయడంలో సఫలమవుతున్నాడు. గత మ్యాచ్‌లలో ఢిల్లీతో ఆడిన ఈ రెండు జట్లు ఘనవిజయాలను తమ ఖాతాలో నమోదు చేసుకున్నాయి. ప్రత్యర్థి జట్టులోని బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లకు అనుగుణంగా తమ జట్టులో మార్పులు, కూర్పులు చేయడంలో సీనియర్ క్రికెటర్‌గా ధోనీ సిద్ధహస్తుడు కావడంతో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత మ్యాచ్‌లో తమ జట్టులోని పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానే దక్షిణాఫ్రికా పేసర్ ఎన్గిడిని రంగంలోకి దింపి మంచి ఫలితం రాబట్టాడు. అదేవిధంగా కేరళ పేసర్ ఆసిఫ్‌ను బరిలోకి దింపడంతో అతను మూడు ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇక జట్టులోని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఈ సీజన్‌లో కేవలం 106 పరుగులు చేసి అంతగా రాణించకున్నా అంబటిరాయుడును ఓపెనర్‌గా లేదా నాలుగో బ్యాట్స్‌మన్‌గా దింపడంతో ఆశించిన ఫలితం కానవచ్చింది. రాయుడు ఈ సీజన్‌లో 370 పరుగులు సాధించాడు. అదేవిధంగా ధోనీ సైతం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు సభ్యుల్లో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ధోనీ ఖాతాలో ఇప్పటికే మూడు అర్ధ సెంచరీలు ఉండడం గమనార్హం. బెంగళూరుతో జరిగిన ఒక మ్యాచ్‌లో ధోనీ 34 బంతులు ఎదుర్కొని 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక తమ స్వంత మైదానంలో జరుగబోయే మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించేందుకు కెప్టెన్ దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా తహతహలాడుతోంది. మరో మూడు మ్యాచ్‌లలో కోల్‌కతా విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఈ జట్టు విదేశీ ఆటగాళ్లు క్రిస్ లీన్, ఆండ్రూ రస్సెల్‌తోపాటు సునీల్ నరైన్‌పై ఆధారపడి ఉంది. క్రిస్ లీన్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లతో కోల్‌కతా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో లీన్ 52 బంతులు ఎదుర్కొని 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు అండగా నిలిచాడు. దినేష్ కార్తీక్ కేవలం తమ జట్టులోని బలమైన బ్యాటింగ్ వ్యవస్థపై ఆధారపడుతున్నాడు. మిడిలార్డర్‌లో రాబిన్ ఉతప్ప ఇంతవరకు అర్ధసెంచరీ చేయకలేకపోయినా, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్‌ను లోయర్ ఆర్డర్‌లో బరిలో దింపినా ఫలితం ఆశించినంతగా కనపడలేదు. ఈ నేపథ్యలో ఈసారి బౌలర్లపై గట్టి నమ్మకంతో ఉన్న కెప్టెన్ వారిద్వారా మంచి ఫలితం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.