క్రీడాభూమి

నీళ్లిస్తాం.. డబ్బిస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 13: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలంటూ బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అన్ని రకాల వాదనలను చేసింది. ఐపిఎల్ మ్యాచ్‌లకు ఎన్ని నీళ్లు వాడతామో అంతే మొత్తం నీటిని నీటి ఎద్దడి నెలకొన్న కరవు ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చింది. అంతేగాక, సహాయక చర్యలు తీసుకునేందుకు వీలుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. బోర్డు వాదనలు విన్న తర్వాత, ఈనెల 30వ తేదీ వరకూ జరగాల్సిన మ్యాచ్‌లకు ఎలాంటి అభ్యంతరం చెప్పని కోర్టు, ఆతర్వాత జరిగే మ్యాచ్‌లను మహారాష్టల్రో కాకుండా మరో ప్రాంతానికి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో బోర్డు కంగుతినింది. మ్యాచ్‌లను తరలించడం కష్టమని వాపోతున్నది. కేసు వివరాల్లోకి వెళితే, మహారాష్టల్రో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. లాథూర్ తదితర ప్రాంతాల్లో చుక్క నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కరవు విలయతాండవం చేస్తున్నది. మహారాష్ట్ర సర్కారు ప్రత్యేక రైళ్లలో నీటిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రజలు నీరు దొరక్క అల్లాడుతుంటే, ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం లక్షలాది లీటర్ల వాడకాన్ని నిరోధించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా లక్షలాది లీటర్లను వృథా చేస్తారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషుల కంటే ఐపిఎల్ మ్యాచ్‌లే ముఖ్యమా అని ప్రశ్నించింది. కాగా, ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) లాయర్లతోపాటు బిసిసిఐ ప్రతినిధులు కూడా ఐపిఎల్ మ్యాచ్‌లకు అనుకూలంగా గట్టిగా వాదించారు. ఒకవైపు కోర్టులో వాదను జరుగుతుండగా మరోవైపు మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లకు ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు పలు ప్రకటనలు చేయించారు. ఐపిఎల్ మ్యాచ్‌లను మరో ప్రాంతానికి మార్చినంత మాత్రాన కరవు తొలగిపోతుందా అని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఐపిఎల్ మ్యాచ్‌లు మరో ప్రాంతానికి తరలివెళితే మహారాష్టక్రు సుమారు 100 కోట్ల రూపాయల నష్టం వస్తుందని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించాడు. కోర్టులో బిసిసిఐ గట్టిగానే వాదించింది. ఐపిఎల్ మ్యాచ్‌లకు ఎంత మొత్తంలో నీటిని వాడుకుంటే అదే మొత్తంలో నీటిని కరవు పీడిత ప్రాంతాలకు పంపిస్తామని హామీ ఇచ్చింది. అంతేగాక, ముఖ్యమంత్రి కరవు సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తామని తెలిపింది.
కోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ కేసు విచారణ జరుగుతున్న పలు సందర్భాల్లో బాంబే హైకోర్టు ఎన్నో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల కంటే క్రికెట్ మ్యాచ్‌లే ప్రధానమా అని నిలదీసింది. తాగడానికిగానీ, వాడకానికిగానీ ఉపయోగపడని నీటినే మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో పిచ్‌లను తడిపేందుకు వాడుతున్నట్టు బోర్డు చేసిన వాదనను కూడా పరిగణలోకి తీసుకొని, ఆ నీటిని ల్యాబ్‌లో పరీక్షించాలని ఆదేశించింది. చుక్క నీరు కూడా దొరకని పరిస్థితుల్లో కరవు కోరల్లో కూరుకుపోయిన మహారాష్టక్రు ఇప్పుడు కావాల్సింది మ్యాచ్‌లు కావని వ్యాఖ్యానించింది. నీటి వృథాను అరికట్టడానికి విధివిధానాలను ప్రకటించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. తాజాగా ఈనెల 30వ తేదీ వరకూ జరగాల్సిన మ్యాచ్‌లను యథాతథంగా నిర్వహించవచ్చని, ఆతర్వాత జరిగే మ్యాచ్‌లను మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని బిసిసిఐని ఆదేశించింది. బోర్డు హామీ ఇచ్చిన విధంగా వాడుకున్న నీటికి తగిన పరిమాణంలో నీటిని కరవు ప్రాంతాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సర్కారుకు సూచించింది.
దిక్కుతోచని బోర్డు
బాంబే హైకోర్టు ఉత్తర్వులతో బిసిసిఐ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లను మొహాలీ తదితర ప్రాంతాలకు తరలించాలని ప్రతిపాదించింది. కానీ, సానుకూల స్పందన రాకపోవడంతో కంగుతిన్నది. సమయం చాలా తక్కువగా ఉన్న కారణంగా మొహాలీలో అదనంగా మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం కష్టమని పంజాబ్ క్రికెట్ సంఘం (పిసిఎ) స్పష్టం చేసినట్టు సమాచారం. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాతోపాటు బెంగళూరులోని చిన్నస్వాని స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా లేకపోలేదు. అయితే, ఆయా ప్రాంతాల క్రికెట్ సంఘాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద ఐపిఎల్ మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహించాలన్నది ఒక ప్రశ్నకాగా, ఇప్పటికే టికెట్ల అమ్మకాలు జరిపినందువల్ల ఆయా మొత్తాలను ఏ విధంగా చెల్లించాలన్నది మరో ప్రశ్న. నీటి ఎద్దడి వల్ల సమస్యల్లో కూరుకుపోయామని వాపోతున్న బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించడంలో బిజీగా ఉంది.
జరిగేవి ఏడు మ్యాచ్‌లే
ముంబయి వాంఖడే స్టేడియంలో మే 29న జరిగే ఫైనల్‌తో కలిసి మహారాష్టల్రో మొత్తం 20 ఐపిఎల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. 30వ తేదీ తర్వాత జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సిందిగా బాంబే కోర్టు కోర్టు ఆదేశించడంతో, ముంబయి, పుణె, నాగపూర్ కేంద్రాల్లో ఏడు మ్యాచ్‌లు మాత్రమే జరుగుతాయి. మిగతా 13 మ్యాచ్‌లు ఇతర ప్రాంతాలకు తరలిపోతాయి.