క్రీడాభూమి

మ్యాచ్‌కు వర్షం ఆటంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 17.1 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడడంతో చాలాసేపటివరకు ఆటను ప్రారంభించడానికి వీలులేకపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గడంతో ఆటను ప్రారంభించారు. అయితే, అప్పటికే కాలాతీతం కావడంతో నిర్ణీత ఓవర్లను 20 నుంచి 18కి కుదించారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ తొలి దశలోనే కొలిన్ మన్రో రూపంలో తొలి వికెట్‌ను చేజార్చుకుంది. ఒక బంతిని ఎదుర్కొన్న మన్రో పరుగులేమీ చేయకుండానే ధవల కులకర్ణి బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అయితే, ఆ తర్వాత ఆడిన బ్యాట్స్‌మెన్‌లను నిలువరించడం రాజస్తాన్ బౌలర్ల వల్ల కాలేకపోయింది. పృథ్వీ షా 25 బంతలు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, మరో నాలుగు బౌండరీల సహాయంతో 47 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 35 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో అర్ధ శతకం నమోదు చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 29 బంతులు ఎదుర్కొని ఐదు సిక్సర్లు, ఏడు బౌండరీల సహాయంతో 69 పరుగులు చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. విజయ్ శంకర్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 17 పరుగులు చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి తిరుగుముఖం పట్టాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఐదు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. రాజస్తాన్ బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్ నాలుగు ఓవర్లలో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ధవల కులకర్ణి, జోస్ బట్లర్, శ్రేయాస్ గోపాల్ చెరో వికెట్ తీసుకున్నారు.