క్రీడాభూమి

ప్రజలకు మరింత చేరువగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ (ఐపీఎల్)ను తెలుగు కామెంటరీ ప్రజలకు మరింత చేరువ చేస్తుందని భారత ఆల్‌రౌండర్, కామెంటేటర్ వేణుగోపాల్ రావు అన్నాడు. గతంతో పోలీస్తే తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తున్న వారి సంఖ్య పెరిగిందని ఆంధ్రభూమితో మాట్లాడారు. క్రికెటర్‌గా మైదానంలో మ్యాచ్ ఆడటం ఒక ఎత్తయతే.. కామెంటేటర్‌గా మ్యాచ్‌ను విశే్లషించడం మరో ఎత్తని చెప్పాడు. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నపుడు బంతి దిశను గమనించడమే కీలకమన్నాడు. అదే విధంగా బౌలింగ్ వేస్తున్నపుడు బ్యాట్స్‌మన్ ఆటతీరును బట్టీ మార్పులు చేర్పులు చేసుకుంటామని అన్నాడు. కాని కామెంటేటర్‌గా ప్రతి చిన్న అంశాన్ని గమనించి, విశే్లషించి వివరాలను ప్రేక్షకులకు అందించడం ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. వనే్డల్లో అత్యుత్తమ సబ్‌ట్యూట్ ఆటగాడిగా అవార్డును దక్కించుకున్న తొలి క్రికెటర్ వేణుగోపాల్ రావు. రంజీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను టీం ఇండియా తరఫున వనే్డల్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశాడు. ఓపెనింగ్‌లోనే కాకుండా, మీడిల్ ఆర్డర్‌లోనూ బ్యాటింగ్ దిగి సత్తా చాటాడు. ప్రస్తుతం స్పిన్నర్‌గాను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఆల్ రౌండర్‌గా ఉన్న నైపుణ్యమే అతడిని ఉత్తమ కామెంటేటర్‌గాను నిలబెట్టింది. బ్యాట్స్‌మన్, ప్రత్యేకించి యువ క్రికెటర్ల ఆటను విశే్లషించడంలో వేణుగోపాల్ రావు పట్టు సాధించాడు. వెంకటపతి రాజు వంటి తన సహాచరులతో కలిసి కామెంటరీ చెప్పడం ఒక కొత్త అనుభవమని వేణుగోపాల్ చెప్పాడు.
* విశాఖపట్నంలో అకాడమీ ..
యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు విశాఖపట్నంలో ఒక క్రికెట్ అకాడమీని నెలకోల్పాలని ఉం దని వేణుగోపాల్ రావు చెప్పాడు. ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నానని, ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించారు.