క్రీడాభూమి

రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్లు కోల్పోయ విజయం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మే 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, మరో బంతి మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్లు కోల్పోయ విజయం సా ధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటిం గ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట్లో అద్భుతంగా రాణించిన్నప్పటికీ చివర్లో బ్యాట్స్‌మెన్లు చెతులెత్తేయడంతో తక్కువ పరుగులకే పరిమి తమైంది. జట్టులో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా 35 బంతుల్లో ఆరు బౌండరీలు, ఒక సిక్సర్ సహాయంతో (52) మాత్రమే రాణించాడు. అంతకుముందు మూడో ఓవర్ తొలి బంతికే ఎదురు దెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడు 9బంతుల్లో రెండు బౌండరీలతో 12 పరుగులు చేసి ఆర్చరీ బౌలింగ్‌లో రెండో ఓవర్ మొదటి బంతికి క్లిన్‌బౌల్డ్ ఆయ్యా డు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వాట్సన్‌తో జత కలిసిన సురేశ్ రైనా క్రీజులో ఆడుగుపెట్టిన్నప్పటి నుండి దూకుడుగా ఆడటం ప్రారంభించా డు. మ్యాచ్‌లో వీలు చిక్కినపుడల్లా రైనా, వాట్సన్‌లు బౌండరీలు సాధిస్తూ జట్టు స్కోరు వేగాన్ని పెంచారు. మ్యాచ్ 12 ఓవర్‌లో ఆర్చరీ బౌలింగ్‌లో వాట్సన్ భారీ షాట్ కోట్టబోయి కీపర్ బట్లర్ చేతికి క్యాచిచ్చి వెనుదిరిగాడు. మరుసటి ఓవర్‌లో చివరి బంతిలో బిన్నీ చేతికి చిక్కడంతో రైనా పెవెలియన్ పట్టాడు. అయితే అదే ఓవర్‌లో చివరి బంతికి ఒకరన్ సాధించి ఆర్థ సెంచరీ పూర్తి చేశాడు రైనా. వరుస ఓవర్లలో రెండ కీలక వికెట్లు కోల్పోవడంతో చెన్నై ఇబ్బందుల్లో పడింది. చివర్లో కెప్టెన్ ధోనీ 23 బంతుల్లో ఒక బౌండరీ, ఒక సిక్సర్‌తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌లో జోస్ బట్లర్ 60 బంతుల్లో 95 పరుగులతో చివరకు క్రీజ్‌లో ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్‌లో విజయానికి 12 పరుగులు అవసరం కావాల్సి ఉండగా, మరో బంతి మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. మరోవైపు ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయ.