క్రీడాభూమి

సిమోనా హలీప్ ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 14: క్రెచ్ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా డబ్ల్యూటీఏ సోమవారం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించుకుంది. గతవారం జరిగిన మాడ్రిడ్ ఓపెన్‌లో తన ప్రత్యర్థి కికీ బెర్టెన్స్‌ను ఓడించడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది. క్విటోవా 2011, 2015 సంవత్సరాల్లో జరిగిన మాడ్రిడ్ ఓపెన్ చాంపియన్‌షిప్ టైటిళ్లు సాధించడంతోపాటు ఈ ఏడాది సెంట్ పీటర్స్‌బర్గ్‌లో తాజాగా జరిగిన ఇదే పోటీలో మరోసారి విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. సిమోన్ హలీప్, కరొలినా వొజియాంకీ, గార్బైన్ ముగురుజా, ఎనా స్విటోలినా, కరొలినా ప్లిస్కోవా, జెలెనా ఓస్తాపెంకో, కారొలినా గార్సియా, పెట్రా క్విటోవా, వీనస్ విలియమ్స్, స్లొయానె స్టీఫెన్స్, జూలియా జార్జెస్, ఆంజిలెక్ కెర్బర్, డేరియా కేసట్‌కినా, మాడిసోన్ కీకస్, కికీ బెర్టెన్స్, కోకో వాండెవేగ్, ఎలీసా మెర్టెన్స్, యాష్‌లీగ్ బార్టీ, మేగ్‌డలెనా రైబర్కోవా వరుసగా 1 నుంచి 20 ర్యాంకుల్లో నిలిచారు.