క్రీడాభూమి

అర్ధ శతకాలతో సెహ్వాగ్ రికార్డు సమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 14: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన రికార్డును రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న జోస్ బట్లర్ సమం చేశాడు. 2012 ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున పాల్గొని ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసి రికార్డును నెలకొల్పాడు. తాజాగా 11వ ఐపీఎల్ సీజన్‌లో జోస్ బట్లర్ వరుసగా ఐదు అర్ధ శతకాలు సాధించి సెహ్వాగ్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 94 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయానికి కీలకపాత్ర పోషించాడు. బట్లర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కై ఒకసారి, కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌పై రెండుసార్లు అర్ధ శతకాలు సాధించాడు. ఈ ఐపీఎల్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జరిగిన టీ-20 మ్యాచ్‌ల్లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన వారిలో ఉన్నారు. 11వ సీజన్‌లో బట్లర్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడి 509 పరుగులు సాధించాడు. జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ జట్ల వేలంలో బట్లర్‌ను రూ.4.4 కోట్లకు రాజస్థాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆరు మ్యాచ్‌ల్లో విజయాలతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో మొదటి నాలుగు జట్లలో ఒకటిగా రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలబడనున్నది.