క్రీడాభూమి

నాపై ఆ దుప్ప్రచారం ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: రిషబ్ పంత్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇంతవరకు ఆడిన మ్యాచ్‌లలో ఏ క్రికెటర్ సాధించనని పరుగులు సాధించి, తన అద్భుత ప్రదర్శనతో ‘ఆరెంజ్ క్యాప్’ను దక్కించుకున్నాడు. అయితే, తన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్నా వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతోపాటు టీ-20 మ్యాచ్‌లలో ఆడేందుకు తనను ఎంపిక చేయకపోవడంపై వస్తున్న కొందరు ఎత్తిపొడిచినట్టు మాట్లాడుతుండడంపై మండిపడుతున్నాడు. ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడుతూ అత్యధిక పరుగులు చేసినంతమాత్రాన అందలం ఎక్కవచ్చుననే వాదనలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నాడు. వనే్డలు, టీ-20 మ్యాచ్‌లలో తనకు అవకాశం కల్పించకపోవడానికి కారణాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని, ప్రస్తుత తన దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉందని ఆయన అన్నాడు. గత వారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ 63 బంతులు ఎదుర్కొని 128 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, ఇంగ్లాండ్‌లో పర్యటించే టీమిండియా వనే్డతోపాటు టీ-20లలో చోటు దక్కకపోవడంపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశాడు. ఐర్లాండ్‌లో టీమిండియా ఆడే రెరండు టీ-20 మ్యాచ్‌లు, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో ఆడే మూడు టీ-20లు, మరో మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడే క్రికెటర్ల జాబితాలో రిషబ్ పంత్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆడుతున్న యువ క్రికెటర్లలో సెంచరీ నమోదు చేయడమే కాకుండా ఇంతవరకు 582 పరుగులు సాధించాడు.