క్రీడాభూమి

ముంబయి వేదికగా ప్రో కబడ్డీ లీగ్ సీజన్ వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 15: ప్రో కబడ్డీ లీగ్ సీజన్-6 వేలం ఈనెల 30, 31 తేదీల్లో ముంబయి వేదికగా జరుగుతాయి. ఈ వేలంలో 422 మంది కబడ్డీ క్రీడాకారులు ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంటారు. వీరిలో 58 మంది విదేశీ ఆటగాళ్లతో పాటు ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ కార్యక్రమం ద్వారా ఎంపికైన 87 మంది భారత ఆటగాళ్లూ ఉన్నారు. ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, కొరియా, మలేసియా, శ్రీలంక నుంచి విదేశీ క్రీడాకారులను వేలంలో పరిగణలోకి తీసుకోనున్నారు. వేలంలో పాల్గొంటున్న 12 ఫ్రాంచైజీల్లో తొమ్మిదింటికి ఎలైట్ క్రీడాకారులను అట్టిపెట్టుకునే అవకాశాలున్నాయి. వీరితో పాటు ఐదో సీజన్లో ఆడిన 21 మంది క్రీడాకారులను ఫ్రాంచైజీలు వశం చేసుకున్నారు.