క్రీడాభూమి

17న బీసీసీఐ అధికారులతో ఐసీసీ వర్కింగ్ గ్రూప్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ప్రపంచ క్రికెట్‌తోపాటు భవిష్యత్‌లో ఆడబోయే టెస్టులపై సుదీర్ఘంగా చర్చించేందుకు వీలుగా ఐసీసీ వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) అధికారులతో గురువారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ప్రబలమైన కొన్ని ముఖ్యాంశాలపై ముఖ్యంగా వాటాదారులు, స్పాన్సరర్లపై బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా, యాక్టింగ్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి, ట్రెజరర్ అనిరుధ్ చౌదరి, సీఈఓ రాహుల్ జోహ్రి ఐసీసీకి సమగ్రంగా వివరించనున్నారు. టీ-20ల మాదిరిగా పాపులారిటీ సంపాదించేందు వీలుగా టెస్టు క్రికెట్‌ను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా డే అండ్ నైట్ టెస్టు క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం కావచ్చునని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా ఇక్కడ పీటీఐతో అన్నాడు.