క్రీడాభూమి

ప్లే ఆఫ్‌పై ముంబయ ఆశలు సజీవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 16: ఇక్కడి వాంఖడే స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించి నాకౌట్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేయగా, లక్ష్య సాధనలో విఫలమైన పంజాబ్ ఐదు వికెట్లకు 183 పరుగులకు పరిమితమైంది. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 15 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. మెక్ క్లీన్‌గన్‌కు రెండు వికెట్లు లభించాయి. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌ను ప్రారంభించిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన ఎవిన్ లూయిస్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో తొమ్మిది పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 12 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో బౌండరీతో 20 పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 15 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మూడు బౌండరీలతో 27 పరుగులు చేశాడు. ఆండ్రూ టై బౌలింగ్‌లో రాహుల త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ వెనుతిరిగాడు. 10 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఆరు పరుగులు చేసి అంకిత్ రాజ్‌పుఠ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కృణాల్ పాండ్య 23 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో ఫోర్‌తో 32 పరుగులు చేసి స్టోయినిస్ బౌలింగ్‌లో అంకిత్ రాజ్‌పుఠ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 23 బంతులు ఎదుర్కొన్న కీరన్ పొలార్డ్ మూడు సిక్సర్లు, ఐదు బౌండరీలతో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అరోన్ పింఛ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. బెన్ కటింగ్ ఏడు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అక్సర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. హార్థిక్ పాండ్య 12 బంతులు ఎదుర్కొని తొమ్మిది పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు. మిచెల్ మెక్‌క్లీన్‌గన్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో ఫోర్‌తో 11, మయాంక్ మార్కండే ఐదు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఏడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు ఓవర్లలో 16 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ మూడు ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు, అంకిత్ రాజ్‌పుఠ్ నాలుగు ఓవర్లలో 46 పరుగులు, మార్కస్ స్టోయినిస్ మూడు ఓవర్లలో 43 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన నిర్ణీత 187 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లలో ఒకడైన క్రిస్ గేల్ 11 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీలతో 18 పరుగులు చేసి మెక్ క్లీన్‌గన్ బౌలింగ్‌లో బెన్ కటింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్, వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ సహచర బ్యాట్స్‌మన్ అరోన్ పింఛ్‌తో కలసి పరుగుల వరద పారించాడు. ఈ దశలో రాహుల్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 35 బంతులు ఎదుర్కొన్న పింఛ్ ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 46 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో హార్థిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. మార్కస్ స్టోయినిస్ రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ 60 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, మరో 10 బౌండరీల సహాయంతో సెంచరీకి చేరువలో 94 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బెన్ కటింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. యువరాజ్ సింగ్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు చేసి మెగ్ క్లీన్‌గన్ బౌలింగ్‌లో లూయిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. చివరి రెండు బంతుల్లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరం కాగా మెక్‌క్లీన్‌గన్ బంతి ప్యాడ్‌కు తగిలి మిడాన్ దిశగా వెళ్లగా అక్షర పటేల్ ఒక పరుగు తీశాడు. ఈ లెగ్ బైతో పంజాబ్ విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచింది. చివరి బంతిని మనోజ్ తివారి బౌండరీకి తరలించగా పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 183 పరుగులు చేసి మూడు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అక్షర పటేల్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 10 పరుగులు, మనోజ్ తివారి నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.