క్రీడాభూమి

‘స్పైడర్‌మన్’ను లైవ్‌లో చూశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్‌లోని అన్ని విభాగాల్లోనూ ప్రజ్ఞా శాలి... ఏ క్రీడాలోనైనా అద్భుతాలు సృష్టించి జట్టును విజయపథంలో నడిపించే సామర్థ్యం అతని సొంతం... అతనే క్రికెట్‌లోనేగాక ఇతర క్రీడల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ అబ్రహం బెంజిమిన్ డివిలియర్స్. ఒంటి చేత్తో మ్యాచ్‌ని మలుపుతిప్పే సామర్థ్యం తనకు ఉందని అతను ఓ అసాధ్యమైన క్యాచ్ ద్వారా నిరూపించాడు. నిజానికి ఈసారి ఐపీఎల్‌లో వివిధ జట్లకు చెందిన అటగాళ్లు ఫిల్డింగ్‌లో అద్భుతాలు సృష్టించి ఓటమి అంచుల్లో ఉన్న జట్లకు ప్రాణం పోసి, గెలుపు బాటలో
నడిపించారు. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఇచ్చిన క్యాచ్ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ అందుకొని మ్యాచ్‌ను మలుపుతిప్పిన సంగతి విదితమే. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న డివిలియర్స్ కూడా మ్యాచ్‌ని పలుపుతిప్పే క్యాచ్ పట్టాడు. సన్‌రైజర్స్ పరాజయానికి డివిలియర్స్ పట్టిన క్యాచ్ కూడా ఒక కారణమైంది.
*
బెంగళూరు, మే 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ఆల్‌రౌండ్ ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నాడు. కేవలం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తేనే ఆల్‌రౌండర్ కారని, ఫీల్డింగ్‌లోనూ అదే స్థాయ ప్రతిభ కనబరచిన ఆటగాడు సిసలైన ఆల్‌రౌండరని అతను గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అనితర సాధ్యమైన క్యాచ్‌ని అందుకొని నిరూపించాడు. డివిలియర్స్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకుని, తన జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని మనసును సైతం దోచుకున్నాడు. బ్యాటింగ్ సమయంలో మోయన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు అలెక్స్ హాలెస్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చి మిడ్ వికెట్ మీదుగా బంతిని బలంగా కొట్టాడు. అది కచ్చింగా సిక్స్ అని కోహ్లీతో సహ ప్రతి ఒక్కరు భావించిన తరుణంలో బౌండరీ వద్ద ఉన్న డివిలియర్స్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. అనంతరం తనను తాను నియంత్రించుకుని బౌండరీ లైన్‌కు కాలు తగులకుండా మాస్టర్ ఫీల్డర్ జాగ్రత్తపడ్డాడు. ఈ క్యాచ్‌ను తిలకించిన కోహ్లీ పూలకరించిపోయాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ డివిలియర్స్ స్పైడర్‌మ్యాన్ విన్యాసాన్ని చూపించాడని అన్నాడు. హాలెస్ కొట్టిన షాట్ కచ్చితంగా సిక్స్ గానే భావించానని, కానీ డివిలియర్స్ సహాసం చేసి గాల్లో ఎగిరి ఆ బంతిని అందుకున్నాడని కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ‘ఈ రోజు స్పైడర్ మ్యాన్‌ను లైవ్‌లో చూశాను’ అని డివిలియర్స్‌ను అభినందించాడు. కాగా. గురువారం నాటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ రాణించిన డివిలియర్స్ కేవలం 39 బంతుల్లోనే 69 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. బ్యాటింగ్‌తో పాటు ఫిల్డింగ్‌లో సత్తా చాటి దేశంలో పాపులారీటీని సాధించేందుకు కృషి చేస్తానని, రానున్న మ్యాచ్‌లో కూడా బెంగళూరు గెలిచి, రన్‌రేట్‌లో ముందుండటానికి పాటుపడుతానని డివిలియర్స్ తెలిపాడు.

చిత్రం..క్యాచ్ పట్టిన డివిలియర్స్‌