క్రీడాభూమి

మాథిస్‌తో పోరు చివరి ఫైట్ కావచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, మే 18: సుమారు ఏడాది విశ్రాంతి తర్వాత మళ్లీ ట్రైనింగ్ సెషన్‌లో చెమటోడుస్తున్న ఫిలిప్పీన్స్ స్టార్ బాక్సర్ మానీ పాక్వియావో జూలై మాసంలో లుకాస్ మాథిస్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నాడు. కెరీర్‌లో అదే తన చివరి ఫైట్ కావచ్చని, అయితే, ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని అతను ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఆ ఫైట్ కొనసాగే విధానాన్ని బట్టి, కెరీర్‌ను కొనసాగించే విషయాన్ని ఆలోచిస్తానని 39 ఏళ్ల పాక్వియావో చెప్పాడు. బాక్సర్‌గానేగాక, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా, నటుడిగా కూడా రాణించిన పాక్వియావో ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. అక్కడ చట్ట సభకు కూడా ఎన్నికయ్యాడు. కెరీర్‌లో ఇంత వరకూ 68 ఫైట్స్ చేసిన అతను 59 విజయాలు నమోదు చేశాడు. వీటిలో 38 నాకౌట్ ద్వారా లభించినవే కావడం విశేషం. 7 ఫైట్స్‌లో పరాజయాలను ఎదుర్కోగా, రెండు ఫైట్స్ డ్రా అయ్యాయి. 2015 మే 2న ఫ్లాయిడ్ మేవెదర్‌తో తలపడి ఓటమిపాలైన తర్వాత కెరీర్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించిన పాక్వియావో ఆతర్వాత మనసు మార్చుకున్నాడు. కెరీర్‌ను కొనసాగించి, తిమోదీ బ్రాడ్లే, జెస్సీ వర్గెస్‌పై విజయాలు నమోదు చేశాడు. గత ఏడాది జూలై రెండో తేదీన జెఫ్ హోమ్‌ను ఎదుర్కొని ఓటమిపాలయ్యాడు. అప్పుడు కూడా పాక్వియావో రిటైర్మెంట్‌పై కథనాలు వెలువడ్డాయి. చాలాకాలం వాటిని ఖండించకుండా వౌనంగా ఉన్న అతను, హఠాత్తుగా లుకాస్ మాథిస్‌తో ఫైట్‌ను ఖాయం చేసుకున్నాడు.
ఏడాదిపాటు రింగ్‌కు దూరమైన పాక్వియావో కెరీర్‌పై భిన్నకథనాలు వచ్చాయి. అతను రాజకీయాల్లోనే కొనసాగుతాడని, కాబట్టి కెరీర్‌ను కొనసాగించే అవకాశాలు లేవని చాలా మంది వాదించారు. పాక్వియావో సైతం అనేక సందర్భాల్లో ఈ అభిప్రాయం బలడపే విధంగా ప్రకటనలు చేశాడు. కానీ, బాక్సింగ్ తన జీవితంలో ఒక భాగమని, అందుకే, సాధ్యమైనంత ఎక్కువ కాలం రింగ్‌లో కొనసాగడానికే ఇష్టపడతానని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మాథిస్‌తో పోరు జరుగుతుందని చెప్పాడు. ఆ ఫైట్ ఏ విధంగా కొనసాగుతుందో తెలియదని అన్నాడు. ఉత్సాహం ఉన్నప్పటికీ, రింగ్‌లో అద్వితీయ ప్రదర్శనలు సులభసాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. అందుకే, ఆ ఫైట్ తర్వాతే తన బాక్సింగ్ కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.

చిత్రం..మానీ పాక్వియావో