క్రీడాభూమి

పాయెట్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 18: ఫ్రాన్స్ సాకర్ సూపర్ స్టార్స్‌లో ఒకడైన దిమిత్రీ పాయెట్‌కు వచ్చేనెల రష్యాలో జరగబోయే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య ఎంపిక చేసిన 23 మంది సభ్యులతో కూడిన వరల్డ్ కప్ జట్టులో పాయెట్‌కు చోటు లభించలేదు. ఇటీవల యూరోపియా లీగ్ ఫైనల్‌లో అట్లాటికో మాడ్రిడ్‌తో తలపడిన వెస్ట్ హామ్ యునైటెడ్ తరఫున బరిలోకి దిగిన పాయెట్ గాయపడ్డాడు. తాను కోలుకుంటున్నానని, వరల్డ్ కప్ పోటీలకు సిద్ధంగా ఉంటానని పాయెట్ ప్రకటించినప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫ్రెంచ్ సాకర్ అధికారులు అతనికి విశ్రాంతినిచ్చారు. వరల్డ్ కప్‌లో ఆడే సమయంలో గాయం తిరగబెడితే, అతని కెరీర్‌కే ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు అతనిని జట్టులోకి తీసుకోలేదు. పాయెట్ వంటి కీలక ఆటగాడు లేకపోవడం దురదృష్టకరమని, కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి విశ్రాంతినివ్వడం మినహా తమకు మరో మార్గం లేదని ఫ్రెంచ్ సాకర్ సమాఖ్య ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
కనిపించని ఎడ్గర్, ననీ పేర్లు
లిస్బన్: వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ కోసం ఎంపిక చేసిన పోర్చుగల్ జట్టులో ఫార్వర్డ్ ఆటగాళ్లు ఎడ్గర్, ననీ పేర్లు కనిపించలేదు. యువతకు ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో కోచ్ ఫెర్నాండో సాంటోస్ వీరిని పక్కకు ఉంచినట్టు సమాచారం. అయితే, వారిని ఎంపిక చేయకపోవడంపై పోర్చుగీస్ ఫుట్‌బాల్ అధికారులు ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

చిత్రం..దిమిత్రీ పాయెట్