క్రీడాభూమి

సారీ...మీ అంచనాలను అందుకోలేకపోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-11లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కలిసి రాలేదు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో రాణించకపోవడంతో ఆర్‌సీబీ ఈసారి అంతగా రాణించలేక పోయింది. ఆర్‌సీబీపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఈసారి సీజన్‌లో ఆశించిన తరహాలో పూర్తి స్థాయి ప్రదర్శనను చేయలేకపోయాం, ఎప్పటికీ మరచిపోలేని చేదు అనుభవాలను మిగిల్చిందని, తమ ఆటతీరును చూస్తే చాలా బాధేసిందన్నాడు. తమ టీమ్‌పై అభిమానులు పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టలేకపోయామని, అందుకు వారంతా క్షమించాలన్నాడు. రానున్న సీజన్‌లో జట్టు మరింత పటిష్టంగా మారి అభిమానుల మన్ననలను పొందుతామని హామీ ఇస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. బెంగళూరు జట్టు మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు మ్యాచ్‌లో గెలుపొందింది.
కోహ్లీ చాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మే 24: రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ అనే చాలెంజ్‌లో ఆయన స్వయంగా పుషప్స్ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రముఖ సినీ నటుడు హృతిక్ రోషన్ ఇప్పటికే ఈ చాలెంజ్‌ను స్వీకరించి మరికొదందరికి సవాల్ చేశారు. ఈ కోణంలో తాజాగా కోహ్లీ కూడా కేంద్ర మంత్రి రాథోడ్ సవాల్‌ను స్వీకరించాడు. ఫిట్‌గా ఉండేందుకు చేస్తున్న కసరత్తులకు సంబంధించిన వీడియోలను పోస్టు చేసిన కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సవాల్‌ను స్వీకరించాల్సిందిగా కోరాడు. దీంతో కోహ్లీ సవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘నీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను, త్వరలోనే నా ఫిట్‌నెస్ చాలెంజ్ వీడియోను పంచుకుంటాను’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. భారతీయులంతా ఫిట్‌గా ఉండాలని భావించిన కేంద్ర మంత్రి రాథోడ్ ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ అనే అంశంపై ఈ చాలెంజ్‌ను ప్రారంభించాడు.