క్రీడాభూమి

పాక్‌కు 162 పరుగుల ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్, మే 25: ఇక్కడి లార్డ్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు శుక్రవారం పాకిస్తాన్ 162 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలిరోజు గురువారం 58.2 ఓవర్లలో 184 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన పాక్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఇమాముల్ హక్ నాలుగు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అజహర్ అలీ 18 పరుగులు, హరీస్ సొహైల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఆటను కొనసాగించిన పాకిస్తాన్ నిర్ణీత 108.4 ఓవర్లలో ఆట ముగిసేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 16 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో నాలుగు పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. హరీష్ సొహైల్ 95 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతో 39 పరుగులు చేసి మార్క్ ఉడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అజర్ అలీ 136 బంతులు ఎదుర్కొని ఆరు బౌండరీలతో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో అజర్ అలీ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. అసాద్ షాఫిక్ 100 బంతులను ఎదుర్కొని ఒక సిక్సర్, ఆరు బౌండరీలతో 59 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో మలన్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్/వికెట్ కీపర్ సఫ్రాజ్ అహ్మద్ 24 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో తొమ్మిది పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో మార్క్ ఉడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 120 బంతులు ఎదుర్కొన్న బాబర్ అజామ్ 10 ఫోర్లతో 68 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
ఫహీమ్ అష్రాఫ్ 38 బంతులు ఎదుర్కొని ఏడు బౌండరీలతో 37 పరుగులు చేసి జేమ్స్ ఆండర్సన్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. షాదాబ్ ఖాన్ 85 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లతో 52 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. హసన్ అలీ రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 109 ఓవర్ ముగిసేసరికి అహ్మద్ అబ్బాస్ ఏడు బంతులు ఎదుర్కొని బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, జేమ్స్ ఆండర్సన్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. స్టువర్ట్ బ్రాడ్, మార్క్ ఉడ్‌కు చెరో వికెట్ లభించాయి.