క్రీడాభూమి

రప్ఫాడించిన రషీద్ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో ఆతిధ్య జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఎంతో ఉత్కంఠ కలిగించిన ఈ పోరులో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించలేక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఓటమిని మూటకట్టుకుంది. సన్‌రైజర్స్ స్పిన్‌మాంత్రికుడు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అటు బ్యాటింగ్‌లో 10 బంతుల్లో 34 పరుగులు చేసి, ఇటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి 19 పరుగులు మాత్రమే ఇచ్చిన రషీద్‌ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయతే, ఈ అవార్డు అందుకున్న రషీద్ తన గొప్ప మనుసును చాటుకుని తమ దేశం (అఫ్గనిస్తాన్)లోని జలాలాబాద్‌లోని ఒక స్టేడియంలో కొద్ది రోజుల జరిగిన బాంబు పేలుళ్ల ఘటన బాధితులకు ఈ అవార్డును అంకితం చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన హైదరాబాద్ జట్టు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో తలపడనుంది. తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన హైదరాబాద్ జట్టులోని ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శిఖర్ ధావన్ మంచి శుభారంభం అందించారు. 24 బంతులు ఎదుర్కొన్న శిఖర్ ధావన్ ఒక సిక్సర్, నాలుగు బౌండరీలతో 34 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలి ఓపెనర్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 27 బంతులు ఎదుర్కొని ఐదు బౌండరీలతో 35 పరుగులు చేశాడు. ఇదే ఈ టీమ్‌లో అత్యధిక స్కోరు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో సాహాను దినేష్ కార్తీక్ స్టంపవుట్ చేశాడు.షాకీబ్ అల్ హసన్ 24 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 28 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీపక్ హుడా 19 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో పీయూష్ చావ్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఎనిమిది పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. యూసుఫ్ పఠాన్ ఏడు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి శివమ్ మావి బౌలింగ్‌లో పీయూష్ చావ్లాకు క్యాచ్ ఇచ్చాడు. రషీద్ ఖాన్ 10 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 34, భువనేశ్వర్ కుమార్ రెండు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. శివమ్ మావి నాలుగు ఓవర్లలో 33, సునీల్ నరైన్ నాలుగు ఓవర్లలో 24, పీయూష్ చావ్లా మూడు ఓవర్లలో 22 పరుగులిచ్చి తలో వికెట్ సాధించారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. సునీల్ నరైన్ 13 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 26 పరుగులు చేసి సిద్ధార్థ కౌల్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. నితీష్ రాణా 16 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 22 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రాబిన్ ఉతప్ప ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి రషీద్ ఖాన్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్/వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఎనిమిది పరుగులు చేసి షాకీబ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. 31 బంతులు ఎదుర్కొన్న క్రిస్ లీన్ రెండు సిక్సర్లు, ఆరు బౌండరీలతో 48 పరుగులు చేసి రషీద్ ఖాన్ చేతిలో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆండ్రూ రస్సెల్ ఏడు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. పీయూష్ చావ్లా 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 12 పరుగులు చేసి సిద్ధార్థ కౌల్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. శివమ్ మావి నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఆరు పరుగులు చేసి బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. శుభ్‌మాన్ గిల్ 20 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 30 పరుగులు చేసి బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కుల్దీప్ యాదవ్ మూడు ప్రసీధ్ కృష్ణ క్రీజులో ఉన్నారు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ రెండు ఓవర్లలో 16, సిద్ధార్థ కౌల్ నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి తలో రెండేసి వికెట్లు తీశారు.
జట్ల సంక్షిప్త స్కోరు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 (వృద్ధిమాన్ సాహా స్టంపవుట్ దినేష్ కార్తీక్ బి పీయూష్ చావ్లా 35, శిఖర్ ధావన్ ఎల్‌బీడబ్ల్యూ కుల్దీప్ యాదవ్ 34, రషీద్ ఖాన్ నాటౌట్ 34, షాకీబ్ అల్ హసన్ రనౌట్ 28, కుల్దీప్ యాదవ్ 29/2).
కోల్‌కతా నైట్ రైడర్స్: 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 (క్రిస్ లీన్ ఎల్‌బీడబ్ల్యూ రషీద్ ఖాన్ 48, శుభ్‌మాన్ గిల్ రషీద్ ఖాన్ బి బ్రాత్‌వైట్ 30, సునీల్ నరైన్ సి బ్రాత్‌వైట్ బి సిద్ధార్థ కౌల్ 26, నితీష్ రాణా రనౌట్ 22, రషీద్ ఖాన్ 3/19, సిద్ధార్థ కౌల్ 2/32, కార్లోస్ బ్రాత్‌వైట్ 2/16).