క్రీడాభూమి

క్రికెట్‌కే వనె్న తెచ్చావ్ బ్రదర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: అంతర్జాతీయ క్రికెట్‌కి ఏబీ డివిలియర్స్ వీడ్కోలు పలికిన తరువాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సహచరుడు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో స్పందించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘బ్రదర్ నువ్వు చేసే ప్రతి పనిలో మంచి జరగాలని ఆశిస్తున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటింగ్ చేసే విధానాన్ని మార్చి క్రికెట్‌కే వనె్నతెచ్చిన మహోన్నత వ్యక్తివి నువ్వు. నీకు, నీ కుటుంబానికి నా అభినందనలు, జీవన ప్రయాణం సాఫీగా, ఆనందంగా, అద్భుతంగా సాగాలి’ అంటూ డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ భావోద్వేంగా స్పందించాడు. క్రికెట్‌లో అన్ని తరహా షాట్లు ఆడే ఆటగాడిగా పేరున్న వ్యక్తుల్లో ఒకడు ఏబీ డివిలియర్స్. అందుకే అతనిని ముద్దుగా మిస్టర్ 360 డిగ్రీస్ అని పిలుస్తారు. వైవిధ్యమైన షాట్లకు మారుపేరుగా నిలిచాడు. దక్షిణాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్ డివిలియర్స్ ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో 114 మ్యాచ్‌లు ఆడి 22 సెంచరీలతో 8,765 పరుగులు సాధించగా, అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో 228 మ్యాచ్‌ల్లో పాల్గొని 25 సెంచరీలతో 1, 672 పరుగులు సాధించాడు. టీ-20 ఫార్మాట్‌లో అందరి మనసు గెల్చుకున్న డివిలియర్స్ 10 అర్ధ సెంచరీలు సాధించాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా రాణించిన ఏబీ మొత్తం 463 క్యాచ్‌లుపట్టి ఉత్తమ ఫీల్డర్‌గా నిలిచాడు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ వికెట్ కీపింగ్‌లో 17 అద్భుతమైన స్టంపింగ్స్ చేసి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు. క్రికెట్ ప్రపంచంలో అందరి మనుసులు దోచిన డివిలియర్స్‌కు కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ అబ్రహం బెంజిమిన్ డివిలియర్స్ షాకిచ్చాడు. క్రికెట్ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ఏబీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని, తన నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో అభిమానులను విస్మయానికి గురిచేసింది.