క్రీడాభూమి

వయసుతో పనేముంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 28: వయసుతో పనేముంది.. ఫిట్నెస్ బాగుంటే ఎలాంటి మ్యాచ్‌నైనా గెలవగలమన్న ధీమా ఆటగాళ్లలో ఉండాలని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఫిట్నెస్ బాగుండడంతో తమ జట్టు ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సన్‌రైజర్స్‌పై విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ సీజన్-11 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చూసిన ప్రతిఒక్కరు జట్టు ఆటగాళ్లు 30 సంవత్సరాల వయసుపైబడిన వారున్నారని, ఈ జట్టు రాణిస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. ఈ నేపథ్యంలో వారి అంచనాలను తారుమారు చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. మ్యాచ్ అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న వారిలో 9 మంది 30 సంవత్సరాలు పైబడిన వారున్నారు. కానీ జట్టులో రాయుడు, వాట్సన్‌లు రాణించి టోర్నమెంట్‌లోనే అత్యధికంగా పరుగులు చేసి జట్టు విజయాల్లో ప్రధాన భూమికను పోషించారు. ‘జట్టులోని ఆటగాళ్ల వయసు గురించి చాలా మంది చర్చించుకున్నారు. వయసు కంటే ప్రధానమైనది ఫిట్నెస్, తమ జట్టులోని ఆటగాళ్లు ఎంతో ఫిట్‌గా ఉన్నారు’ అని ధోనీ తెలిపాడు. ఐపీఎల్‌లో విశేషంగా రాణించిన అంబటిరాయుడు (602 పరుగులు), షేన్ వాట్సన్ (555 పరుగులు) వయసు 30 సంవత్సరాలు పైబడినవారేనని వివరించాడు. క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆటగాడికి వయసు అడ్డంకే కాదని, అదో సంఖ్యను సూచిస్తుంది తప్ప అసలు వయసు సమస్యే కాదన్నాడు. మ్యాచ్ జరుగుతున్నపుడు జట్టు సారథికి కావాల్సింది మైదానంలో ఆటగాళ్లు చురుకుగ్గా కదలడం, బ్యాట్స్‌మన్‌లు కొట్టే షాట్‌లను కట్టడి చేయడంపై దృష్టి సారించాలన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు భువనేశ్వర్ కుమార్‌తో పాటు రషీద్‌ఖాన్ తమపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేసేవారని, మధ్య ఓవర్లలో పరుగులు రాబట్ట్టాలనుకున్నాం కానీ ప్రతి నిమిషం ఎంతో ప్రత్యేకంతో కూడుకున్నదన్నాడు. షేన్ వాట్సన్ చేలరేగి ఆడి 117 పరుగులతో అజేయ సెంచరీ సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్‌ను గెలిపించి కప్ సాధించిపెట్టాడని ధోనీ ప్రశంసలు కురిపించాడు. ఫైనల్లో తొలి పది బంతుల్లో పరుగుల ఖాతానే తెరవని వాట్సన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి ఆడి 57 బంతుల్లోనే 117 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వాట్సన్ వీరోచితమైన బ్యాటింగ్‌తో ఐపీఎల్ లీగ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ను ప్రదర్శించిన సన్‌రైజర్స్ బౌలర్లు చల్లబడ్డారు. గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ తరపున ఏడు మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ కేవలం 71 పరుగులు మాత్రమే సాధించాడు. సీజన్-11లో రాణించిన వాట్సన్ 15 మ్యాచ్‌ల్లో ఆడి 393.64 సగటుతో 555 రన్స్ చేసి సత్తాచాటాడు 36 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఆటగాడు వాట్సన్.