క్రీడాభూమి

నిషిద్ధ పదార్థాలు కలిపేస్తారేమో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇంతవరకు ఏ క్రీడాకారిణి ఎదుర్కోని పరిస్థితులను కెరీర్ పరంగా కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్టు మీరాబాయి ఛాను ఎదుర్కొంది. ప్రపంచ చాంపియన్‌గా రాణించడంతోపాటు ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకాన్ని సంపాదించి పెట్టిన మీరాబాయి ఛానును ఓ తెలియని భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు తనపై 45 డోపింగ్ పరీక్షలు పెట్టినా వాటినుంచి దిగ్విజయంగా బయటపడిన ఛాను ‘నన్ను ఎలాగైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను ఆ భయం వెంటాడుతోంది. నా ఆహారంలో ఈ పదార్థాలు కలిపి నన్ను తప్పు పట్టేందుకు, అనర్హురాలిగా ప్రకటించేందుకు ప్రయత్నించవచ్చునన్న భయం నాకు ఉంది. ఇలాంటి దుశ్చర్యలకు ఆస్కారం లేకుండా నా రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు పెట్టండి. ఎందుకంటే నన్ను ఫెయిల్ చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భాగంగా నామీద ఎలాంటి ప్రయత్నమైనా జరుగవచ్చు. ఆహారంలోనూ మత్తు పదార్థాలు కలపవచ్చు’ అని ఆమె స్పష్టం చేసింది. మీనాబాయి ఛాను చేసిన అభ్యర్థనను భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వెల్లడించడంతోపాటు శిక్షణ, డైనింగ్ ప్రాంతాలతో సహా అన్ని కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖను కోరింది. ముఖ్యంగా బయటివారితో భారత వెయిట్ లిఫ్టర్లు కలుసుకునే ప్రాంతాల్లోనూ ఈరకమైన కెమెరాలను ఏర్పాటు చేయాలని ఈ ఫెడరేషన్ క్రీడా శాఖకు స్పష్టం చేసింది. ఇలాంటి కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల ఏంజరుగుతుందో తెలుసుకునే అవకాశం తమకు ఉంటుందని, అనవసరంగా ఎవరినీ డోపింగ్ కేసులో ఇరికించే ప్రయత్నాలను నివారించడం సాధ్యమవుతుందని ఫెడరేషన్ సెక్రెటరీ జనరల్ సహదేవ్ యాదవ్ తెలిపాడు. అలాగే తన గదిలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో తెలుసుకోవడానికి వీలుగా తన రూమ్‌లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖకు మీరాబాయి లేఖ రాసింది. తాను గదిలో లేని సమయంలో ఎవరైనా వచ్చి తన ఆహారంలోగానీ, పానీయాల్లోగానీ ఉత్ప్రేరకాలను కలిపే అవకాశం ఉంటుందని పేర్కొన్న ఆమె దీనిని నివారించాలంటే తన గదిలో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని కోరింది. తాను తప్పు చేయలేదు, చేయను కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇతరులు తనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండే ఈ అభ్యర్థనను చేస్తున్నానని తెలిపింది. కాగా, అన్ని శిక్షణ కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి క్రీడా మంత్రిత్వ శాఖ అంగీకరించిందని ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ యాదవ్ తెలిపాడు. వచ్చే నెల మొదట్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం భారత వెయిట్ లిఫ్టర్లకు హిమాచల్‌ప్రదేశ్‌లోని షిలారులోగల ఎస్‌ఐఐ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. వీరంతా జూన్ మూడో తేదీన పాటియాలాలోని ఎన్‌ఐఎస్ కేంద్రానికి తిరిగి వస్తారని, అప్పట్లోగానే సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లు పూర్తవుతుందని ఆశిస్తున్నామని అన్నాడు. మీరాబాయి అభ్యర్థనను క్రీడా మంత్రిత్వ శాఖ అంగీకరించిదన్న ప్రశ్నకు ‘ఇందులో అంగీకరించకపోవడం ఏముంది. ఆమె ప్రస్తుతం ప్రపంచ చాంపియన్. ఏదైనా జరగకూడనిది జరిగితే నష్టం ఎవరికి? దీనివల్ల ఆమెకు వ్యక్తిగతంగానే కాదు, మొత్తం దేశానికే నష్టం కలుగుతుంది’ అని జాతీయ ప్రధాన కోచ్ పేర్కొన్నాడు. గతంలో కూడా తన ఆహారంలో ఉత్ప్రేరకాలు కలిపినట్టుగా అనుమానాలు ఉన్నాయని ఇద్దరు వెయిట్ లిఫ్టర్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. నిజానికి పాటియాలలోని జాతీయ శిక్షణ శిబిరంలో సరైన వాతావరణం లేదని, క్రీడాకారులు తాగే పానీయాల్లోగానీ, తీసుకునే పదార్థాల్లోగానీ నిషిద్ధ పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా కలిపే అనుమానాలున్నాయని అన్నాడు. అందుకే పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉన్నామని, మన వెయిట్ లిఫ్టర్లు ఎవరూ ఈ తరహా కుట్రలకు బలికాకుండా నిరోధించేందుకు, క్రీడాకారులు వారి సామర్థ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నాడు.