క్రీడాభూమి

గాయపడిన సాహా అఫ్గానిస్తాన్ టెస్టుకు డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: వచ్చేనెల 15న బెంగళూరులో అఫ్గనిస్తాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆడేది అనుమానమే. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈనెల 25న జరిగిన ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడిన సాహా గాయపడ్డాడు. దీంతో అతని కుడిచేతి బొటనవేలి గాయమైంది. ప్రస్తుతం సాహా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేగానీ బెంగళూరు టెస్టులో ఆడే అవకాశం ఉండకపోచ్చునని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, సాహా స్థానంలో పార్థివ్ పటేల్ లేదా దినేష్ కార్తీక్ ఆడే అవకాశం ఉందని పేర్కొంది.