క్రీడాభూమి

బహ్రెయిన్, యూఏఈతో తలపడడం కష్టమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: బహ్రెయిన్, యూఏఈ వంటి బలమైన ఫుట్‌బాల్ జట్లతో తలపడడం చాలా కష్టమేనని, అయినా భారత క్రీడాకారులు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తారనే నమ్మకం తనకు ఉందని జాతీయ ఫుట్‌బాల్ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టంటైన్ అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ పోటీలో భారత ఫుట్‌బాల్ జట్టులోని సునీల్ ఛెత్రి, అతని సహచర ఆటగాళ్లు అత్యధిక గోల్స్ చేస్తారని విశ్వసిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు. 2011 ఆసియా కప్‌కు ఐరిస్‌కు చెందిన బాబ్ హాఫ్‌టోన్ కోచ్‌గా వ్యవహరించాడు. అతని సారథ్యంలో భారత్ ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బహ్రెయిన్ వంటి దేశాల జట్లను బలంగా ఢీకొని విజయం సాధించింది. కానీ అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందని ఆయన అన్నాడు. మొత్తం 24 టీమ్‌లు పోటీ పడే ఈ టోర్నమెంట్‌లో ప్రస్తుతం భారత్ థాయ్‌లాండ్, ఆతిధ్య యూఏఈ, బహ్రెయిన్‌తో జతకట్టి గ్రూప్-ఏగా ఆవిర్భవించింది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది.
భారత్ తన ఓపెనింగ్ మ్యాచ్‌ను జనవరి 6న అబుదాబీలో థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. ఆ తర్వాత జనవరి 10న అబుదాబీతో యూఏఈ, ఆ తర్వాత జనవరి 14న బహ్రెయిన్‌తో షార్జాలో తలపడుతుంది. ఈ టీమ్‌లన్నింటితో ఆడిన మ్యాచ్‌లలో నాకౌట్ రౌండ్‌లలో క్వాలిఫై అవుతామనే నమ్మకం తమకు ఉందని భారత కోచ్ స్టీఫెన్ అన్నాడు. అన్ని జట్లతో పోటీ పడేందుకు తమ జట్టు సభ్యులంతా మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నారని, థాయ్‌లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్ అద్భుతంగా ఉండగలదనే నమ్మకం తనకు ఉందని, ఇందులో గెలుపుతో మరిన్ని విజయాల దిశగా దూసుకెళ్తామని ఆయన అన్నాడు.