క్రీడాభూమి

బెంగళూరు రికార్డును తిరగరాసిన చెన్నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 29: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్‌లో ఈనెల 27న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌లో అద్భుత విజయంతో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన 11 ఐపీఎల్ సీజన్‌లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ పేరిట (2016లో 142 సిక్సర్లు) ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును ఇపుడు చెన్నై సూపర్ కింగ్స్ (145 సిక్సర్లు) తిరగరాసింది. ఈనెల 27న సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో చెన్నై ఖాతాలో 10 సిక్సర్లు నమోదు కాగా, వీటిలో షేన్ వాట్సన్‌వే ఎనిమిది ఉన్నాయి. దీంతో ఈ సీజన్‌లో ధోనీ సేన మొత్తం 145 సిక్సర్లు నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన ఘనత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. కోహ్లీ సేన ఖాతాలో 2016 సీజన్‌లో మొత్తం 142 సిక్సర్లు నమోదయ్యాయి. ఆ సీజన్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 38 సిక్సర్లు బాదాడు. ఒక ఆటగాడి వ్యిక్తిగత ఖాతాలో ఇదే అత్యధిక రికార్డు. ఇదే జట్టులోని క్రికెటర్లు ఏబీ డివిలియర్స్ 37, క్రిస్ గేల్ 21 సిక్స్‌లు ఆడారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు (145) నమోదు చేసినా ఈ టీమ్‌లోని ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్‌తో సహా ఎవరు కూడా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత సిక్సర్ల రికార్డును తిరగరాయలేకపోయారు. వాట్సన్ ఈ సీజన్‌లో 35 సిక్సర్లు, అంబటి రాయుడు 34, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 30, సురేష్ రైనా 12, డ్వేన్ బ్రేవో 10 సిక్సర్లు చేసి జట్టును విజయపథంలో నిలిపారు. ఇదిలావుండగా, ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు ఆడిన చెన్నై (2018లో 145 సిక్సర్లు), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2016లో 142 సిక్సర్లు) తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 130 సిక్సర్లు చేసింది. ఆ తర్వాత స్థానంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2104లో 127 సిక్సర్లు), ముంబయి ఇండియన్స్ (2015లో 120 సిక్సర్లు) ఉన్నాయి.