క్రీడాభూమి

అఫ్గాన్ బృందంలో స్టార్ ఆటగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: టీమిండియాతో జూన్ 14న బెంగళూరులో నిర్వహించనున్న టెస్టు మ్యాచ్‌లో తొలిసారిగా అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు ఆడనున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఇద్దరు స్టార్ క్రికెటర్లకు ఇందులో చోటుదక్కింది. 15 మంది అఫ్గాన్ జట్టు సభ్యులు కలిగిన టీమ్‌లో వరల్డ్ ప్రీమియర్ టీ-20 స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్‌తోపాటు మరో యువ క్రికెటర్ 17 ఏళ్ల ముజీబ్ ఉర్ రహ్మాన్‌కు కూడా స్థానం దక్కింది. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సంచలన ఆటగాడికి వినుతికెక్కిన 19 ఏళ్ల రషీద్ ఖాన్‌తోపాటు, ముజీబ్ ఉర్ రహ్మాన్, మరో ఇద్దరు స్పిన్నర్లు జహీర్ ఖాన్, ఎడమచేతివాటం స్పినర్ అమీర్ హమ్‌జా హొటాక్ వంటివారు అస్ఘర్ స్టానిక్‌జై నాయకత్వంలోని టీమ్‌లో కీలక సభ్యులుగా ఉంటారు. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ పొట్టి ఫార్మాట్లలో అద్భుత ఆటతీరుతో ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో టెస్టు మ్యాచ్‌లలో చోటు దక్కించకున్నారు. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ నాలుగు ఫస్ట్‌క్లాస్ గేమ్‌లు ఆడారు.
ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ గత రెండు ఐపీఎల్ సీజన్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రషీద్ ఖాన్ ఈ సీజన్‌లో 21 వికెట్లు పడగొట్టాడు. టీ-20 ఫార్మట్‌లో ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజ సచిన్ తెండూల్కర్ వంటివారి ప్రశంసలు అందుకున్న రషీద్ ఖాన్‌పైనే ఇపుడు అందరి దృష్టి పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, టీమిండియాతో జరిగే టెస్టు మ్యాచ్‌లో ఎంతో అనుభవం కలిగిన వికెట్ కీపర్ ధావ్‌లత్ జద్రాన్ గాయం కారణంగా ఆడే అవకాశం లేదు. ఇదిలావుండగా, టెస్టు క్రికెట్ ఆడేందుకు అవకాశం రావడం అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు శుభపరిణామమని టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. తాము ఏ జట్టును అంత తేలిగ్గా తీసుకోమని, తమ సహజ ధోరణిలోనే రానున్న బెంగళూరు టెస్టు మ్యాచ్‌లో ఆడతామని ఆయన పేర్కొన్నాడు.

చిత్రాలు.. రషీద్ ఖాన్ *ముజీబ్ ఉర్ రహ్మాన్