క్రీడాభూమి

ఒకవైపు ఆనందం.. మరోవైపు ఆందోళన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లాగెన్‌ఫర్ట్ (ఆస్ట్రియా), జూన్ 3: ప్రపంచ కప్ సాకర్ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఈనెల 14 నుంచి రష్యాలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న ఈ జట్టుకు గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయెర్ గాయం సమస్యగా మారింది. అయితే, ఆస్ట్రియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో న్యూయెర్ బరిలోకి దిగాడు. మోకాలి గాయం నుంచి కోలుకొని, పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని నిరూపించుకున్నాడు. 23 మంది సభ్యులతో కూడిన జర్మనీ వరల్డ్ కప్ జట్టుకు ఇది ఆనందాన్నిచ్చే పరిణామమే. అయితే, అదే మ్యాచ్‌లో 1-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోవడం జర్మనీని ఆందోళనకు గురి చేస్తున్నది. 2014లో బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనాను ఓడించి టైటిల్‌ను అందుకున్న జర్మనీ ఈసారి దానిని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తి రేపుతున్నది. అధికారిక బెట్టింగ్ కూడా కొనసాగుతున్నందున, పందెంరాయుళ్ల హడావుడి పెరిగింది. న్యూయెర్ ఫిట్నెస్ సమస్య గత కొంతకాలంగా జర్మనీని వేధిస్తున్న నేపథ్యంలో, అతను జట్టులో లేకపోతే టైటిల్‌ను మరోసారి దక్కించుకోవడం కష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనితో, అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్ న్యూయెర్ ఫిట్నెస్‌ను పరీక్షించడానికి ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌ని సరైన వేదికగా భావించింది. ఈ మ్యాచ్‌లో న్యూయెర్ ఆడిన తీరు అతను మళ్లీ పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడనే సంకేతాలను అందించింది. అయితే, జట్టు కూర్పు, డిఫెన్స్ వైఫల్యాలు జర్మనీకి కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. ఆస్ట్రియా చేతిలో ఓడడంతో, ఆ జట్టు అధికారులు, ఆటగాళ్లు ఎక్కడెక్కడ పొరపాట్లు దొర్లాయో తెలుసుకొని, లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. గత వరల్డ్ కప్‌లో అర్జెంటీనాపై జర్మనీ అత్యంత నాటకీయంగా గెలిచింది. నిజానికి నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. ఎక్‌స్ట్రాటైమ్‌లో మారియో గొజే కీలకమైన గోల్ సాధించి, జర్మనీని విజయపథంలో నడిపాడు. లేకపోతే, మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమయ్యేది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుంటే, ఈసారి దాడులకే జర్మనీ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాక, ప్రత్యర్థులు గోల్స్ చేయకుండా నిలువరించాలి. గోల్‌కీపర్ న్యూయెర్ మరింత సమర్థంగా తన బాధ్యతను నిర్వర్తించాలి. మొత్తం మీద వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయంలో జర్మనీని న్యూయెర్ ఫిట్నెస్ సమస్య నుంచి బయటపడ్డాడన్న ఆనందం, ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఓడామన్న ఆందోళన ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వరల్డ్ కప్‌లో మొదటి రౌండ్ నుంచే పోరాటం సాగించకపోతే, నాకౌట్ దశకు చేరుకోవడం కష్టం కాబట్టి, అన్ని జట్లూ ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న జర్మనీ తన స్థాయికి తగినట్టు ఆడకపోతే, నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది.