క్రీడాభూమి

సాకర్‌కూ మద్దతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ మ్యాచ్‌లను కూడా చూడాలని, అన్ని క్రీడలను ఒకే రీతిలో అదరించినప్పుడే క్రీడాభారతాన్ని చూడగలుగుతామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. నాలుగు దేశాల ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబయిలో జరిగే గ్రూప్ మ్యాచ్‌ని తిలకించేందుకు స్టేడియానికి తరలి రావలని భారత సాకర్ జట్టు కెప్టెన్ సునీల్ ఛత్రీ ట్విటర్ ద్వారా చేసిన సూచనపై కోహ్లీ స్పందించాడు. భారత ఫుట్‌బాల్ జట్టు ఉన్నత ప్రమాణాలను అందుకోవడానికి ఎంతగానే శ్రమిస్తున్నదని అన్నాడు. ఆటగాళ్లు అంకిత భావంతో కృషి చేయాన్ని, ఉన్నతంగా రాణించాలన్న పట్టుదలతో నిరంతరం ప్రాక్టీస్ చేయడాన్ని తాను స్వయంగా చూశానని కోహ్లీ తెలిపాడు. ఛత్రీ పోస్ట్ చేసిన వీడియో సందేశం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, అందుకే, ప్రత్యేకంగా ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానని కోహ్లీ తెలిపాడు. క్రీడాభారతంగా దేశం వెలుగొందాలంటే, అన్ని క్రీడల్లోనూ ఉన్నత ప్రమాణాలను సాధించాల్సి ఉంటుందన్నాడు. అభిమానుల ప్రోత్సాహం, మద్దతుతోనే ఇది సాధ్యమవుతుందని చెప్పాడు.
ఖాళీ స్టేడియాలు..
ముంబయిలో జరుగుతున్న నాలుగు దేశాల ఫుట్‌బాల్ టోర్నీని తిలకించడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తి ప్రదర్శించకపోవడంతో, మ్యాచ్‌లు జరిగే సమయంలో స్టేడియాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కెన్యతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఛత్రీ హ్యాట్రిక్ సాధించాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో హ్యాట్రిక్‌ను నమోదు చేయడం ఇది మూడోసారి. భారత్ గొప్పగా ఆడినప్పటికీ, ఆ మ్యాచ్‌ని చూసేందుకు సుమారు 2,000 మంది మాత్రమే వచ్చారు. దీనితో స్టేడియం దాదాపుగా ఖాళీగా కనిపించింది. ముంబయితో జరిగే మ్యాచ్ ఛత్రీకి కెరీర్‌లో వందవ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అతను తన వీడియో సందేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, తన వందో అంతర్జాతీయ మ్యాచ్‌ని చూసేందుకు తరలి రావాలని విజ్ఞప్తి చేశాడు. అతని విజ్ఞప్తికి కోహ్లీ మద్దతు పలికాడు. స్టేడియాలు ఖాళీగా ఉండడం క్రీడా రంగానికి శుభసూచకం కాదన్నాడు. అన్ని క్రీడలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికాడు. ఛత్రీ కోరినట్టు, సోమవారం జరిగే మ్యాచ్‌కి వేలాదిగా రావాలని, స్టేడియం కిక్కిరిసిపోవాలని కోరాడు.

చిత్రం..భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ