క్రీడాభూమి

సునీల్ ఛెత్రీ విజ్ఞప్తికి స్పందించిన అభిమానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 4: తన ఫుట్‌బాల్ చరిత్రలో 100వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా ఒక జట్టు కెప్టెన్ చేసిన విజ్ఞప్తి మేరకు అభిమానులు చెప్పనలవికాని విధంగా స్పందించారు. భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ ముంబయి ఫుట్‌బాల్ మైదానంలో కెన్యాతో తలపడనున్న ఇంటర్ కాంటినెంటల్ కప్ గేమ్ సందర్భంగా తన అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈమేరకు తనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవనున్న మ్యాచ్ సందర్భంగా టికెట్లు కొనుగోలు చేసి తనపై అభిమానాన్ని చాటాలని కోరుతూ ఆయన ఒక వీడియో ద్వారా ఫుట్‌బాల్ అభిమానులు, మద్దతుదారులను అభ్యర్థించాడు. ఛెత్రీ పిలుపునకు అభిమానులు, మద్దతుదారులు బాగానే స్పందించడంతో మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లన్నీ ఒకేసారి అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు సైతం ధృవీకరించారు. ఈ సందర్భంగా ముంబయి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిత్య థాకరే ఇక్కడ మాట్లాడుతూ భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ హృదయపూర్వక అభ్యర్థనకు ఎంతోమంది అభిమానులు, మద్దతుదారులు స్పందించి, టికెట్లన్నీ కొనుగోలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారని అన్నాడు. ఇలా ఒక మ్యాచ్‌కు టికెట్లన్నీ అమ్ముడుపోవడం ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ప్రతి గేమ్‌కు ఇదే తీరున స్పందన ఉండగలదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు. చైనీస్ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఆధ్వర్యంలోని జట్టు 5-0 తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఈ ఘనత సాధించిన కెప్టెన్ ఛెత్రీని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ వంటివారు సైతం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఛెత్రి ఇంతవరకు ఆడిన 99 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 59 గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా ఘనత సాధించడమే కాకుండా ప్రపంచంలోనే ఈ రికార్డు సృష్టించిన మూడో వ్యక్తిగా నిలిచాడు. తాను ఆడబోయే నూరవ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకించాలని వీడియో ద్వారా కేవలం యువకులకు మాత్రమే కాదని, అందరూ స్పందించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చానని సునీల్ ఛెత్రీ పేర్కొన్నాడు.