క్రీడాభూమి

వేధించిన ఛాతీ కండరం నొప్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 4: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వైదొలగింది. ఇప్పటికే మూడో రౌండ్ దాటి సోమవారం నాలుగో రౌండ్‌లో తన చిరకాల ప్రత్యర్థి గ్రాండ్‌శ్లామ్ దిగ్గజం మారియా షరపోవాతో పోటీ పడాల్సిన కొన్ని నిమిషాల ముందు ఛాతీ కండరం నొప్పితో వేధిస్తుండడంతో వైదొలగుతున్నట్టు 36 ఏళ్ల సెరెనా ప్రకటించడమే కాకుండా ఇది తనకు నిరాశను కలిగించిందని పేర్కొంది. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో జూలియా జార్జ్‌పై విజయం సాధించిన తర్వాత ఛాతీలో కండరం నొప్పితో బాధపడింది. ఈ సందర్భంగా సెరెనా మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ హృదయ సంబంధ నొప్పితో బాధపడుతున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఆడలేనని, మ్యాచ్‌కు న్యాయం చేయలేనని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఈ మ్యాచ్ కష్టసాధ్యంతో కూడుకున్నదని, ఇందుకు శారీరకంగా అన్నివిధాల సన్నద్ధంగా ఉండాలని, కానీ తనకు ఛాతీలో కండరం నొప్పి వేధిస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ నుంచి వైదొలగడమే సరైన నిర్ణయంగా భావించానని పేర్కొంది. ప్రస్తుతం పారిస్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె మళ్లీ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది.
క్వార్టర్ ఫైనల్‌కు రాఫెల్ నాదల్
ఇప్పటికే పదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌గా అవతరించిన స్టార్ ఆటగాడు రాఫెల్ నాదల్ సోమవారం జరిగిన మూడో రౌండ్‌లో 6-3, 6-2, 7-6 (7-4)తో ప్రత్యర్థి జర్మనీకి చెందిన మాక్జిమిలియన్ మార్టెరెర్‌పై విజయం సాధించాడు. దీంతో నాదల్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. 14 ఏళ్లలో 12సార్లు నాదల్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.