క్రీడాభూమి

బరిలోకి నేమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లివర్‌పూల్, జూన్ 4: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ స్టయికర్ నేమార్ ఆరోగ్యం నుంచి కోలుకుని వరల్డ్ కప్ కంటే ముందు బరిలోకి దిగడంతో అతని అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు. కుడి కాలికి శస్త్ర చికిత్స జరిగిన తర్వాత మూడునెలలపాటు విశ్రాంతి తీసుకున్న నేమార్ కోలుకుని ఆదివారం క్రొయేషియాతో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో 2-0తో జట్టును గెలిపించి జట్టు కోచ్ టైట్ సహా అభిమానులను అలరించడంతో తాను రష్యా వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమేనని ప్రత్యక్షంగా నిరూపించాడు. ఈ సందర్భంగా క్రొయేషియా టీమ్‌కు చెందిన ఆటగాడు తియాగో సిల్వ మాట్లాడుతూ ఏ జట్టు అయినా నేమార్ వంటి క్రీడాకారుడు మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడంటే ఎంతో ఉపశమనం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెర్నాడిన్‌హో స్థానంలో బరిలోకి దిగిన నేమార్ జట్టును విజయవంతంగా గెలిపించే బాధ్యతను స్వీకరించాడు. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌కు దాదాపు 35వేల మంది అభిమానులు హాజరైనా ఆటలో తొలి సగం భాగం వరకు నెమ్మదించిన అభిమానులు రెండో అర్ధ భాగంలో నేమార్ బరిలోకి దిగడంతో ఈలలు, కేకలతో ప్రోత్సహించారు. మ్యుజీషియన్ డేనియెల్ ఆడ్రియానోతో సహా ఎంతోమంది బ్రెజిల్ అభిమానులు ఈ మ్యాచ్‌ను తిలకించారు. మ్యుజీషియన్ డేనియెల్ ఆడ్రియానో మాట్లాడుతూ ఈ మ్యాచ్‌ను ఆసాంతం తిలకించిన తర్వాత నేమార్ సాధించిన స్కోరుతో రష్యా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తప్పకుండా బ్రెజిల్ ఘనవిజయం నమోదు చేస్తుందనే నమ్మకం వచ్చిందని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌కు వచ్చిన తనకు బ్రెజిల్ టీమ్‌పై ఎలాంటి అంచనాలు లేవని, కానీ టీమ్ సమష్టిగా రాణించి విజయం సాధించడం గొప్ప విషయమని అన్నాడు. తాను మూడు నెలల విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగడం చాలా సంతోషంగా ఉందని, దీనికోసమే చాలా గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఈ మూడు నెలల పాటు ఎంతో అవస్థలు పడ్డానని పేర్కొన్నాడు. నేమార్ జట్టులోకి పునరాగమనం ఎంతో మంచి పరిణామమని, తమ అంచనాలకు భిన్నంగా నేమార్ రాణించాడని బ్రెజిల్ జట్టు కోచ్ టైట్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నందున మున్ముందు జరిగే మ్యాచ్‌లలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లను ఢీకొనాల్సి ఉంటుంది కనుక ఆరోగ్యంపై కాస్త దృష్టి సారించాలని నేమార్‌కు సూచించాడు.