క్రీడాభూమి

మహిళల ఆసియా కప్ టీ-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, జూన్ 4: భారత మహిళ క్రికెట్ జట్టు ఆసియా కప్ టీ-20 మ్యాచ్‌లో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. (్భరత్ తన ప్రారంభ మ్యాచ్‌లో మలేషియాను 142 పరుగులతో ఓడించింది). సోమవారం ఇక్కడ థాయిలాండ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 66 పరుగులతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన విజయం సాధించింది. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగా, ప్రత్యర్థి జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 66 పరుగులే చేసింది. తొలుత టాస్ గెలిచిన థాయిలాండ్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో భారత్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన బ్యాటింగ్‌కు దిగి 22 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో 29 పరుగులు చేసి బూచట్‌హామ్ బౌలింగ్‌లో ఖామ్‌చోంపుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. వేదా కృష్ణమూర్తి 14 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 11 పరుగులు చేసి లీంగ్‌ప్రసెర్ట్ బౌలింగ్‌లో బూచట్‌హామ్‌కు క్యాచ్ ఇచ్చింది. మోనా మెస్రమ్ 45 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 32 పరుగులు చేసి లీంగ్‌ప్రసెర్ట్ బౌలింగ్‌లో టిప్పోచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. 21 బంతులు ఎదుర్కొన్న అనుజా పాటిల్ రెండు ఫోర్లతో 22 పరుగులు చేసి బౌల్డ్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో 27, పూజా వస్త్రాకర్ రెండు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఆరు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. థాయిలాండ్ బౌలర్లలో వొంగ్‌పాకా లీంగ్‌ప్రసెర్ట్ మూడు ఓవర్లలో 16 పరుగులిచ్చి రెండు వికెట్లు, రతనాపోర్న్ పాడుంగ్‌లెర్ట్ నాలుగు ఓవర్లలో 16 పరుగులు, నట్టాయా బూచట్‌హామ్ మూడు ఓవర్లలో 22 పరుగులిచ్చి తలా ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 133 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన థాయిలాండ్‌లో నట్టకన్ ఛంతమ్ 13 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి పూజావస్త్రాకర్ బౌలింగ్‌లో పూనమ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చింది. నర్యుమోల్ చల్‌వాల్ 28 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 14 పరుగులు చేసి హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. నట్టాయా బూచ్‌ట్‌హామ్ 40 బంతులు ఎదుర్కొని 21 పరుగులు చేసి హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్‌లో స్టంపవుట్ అయింది. వికెట్ కీపర్ నన్నాపట్ హాన్చరోయెంకల్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఎల్‌బీడబ్ల్యూ అయింది. రటానాపోర్న్ పడుంగ్‌లెర్డ్ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి ఎల్‌బీడబ్ల్యూ అయింది. కెప్టెన్ సోర్నారిన్ టిప్పోచ్ 10 బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. ఛనిందా సుత్తిరాంగ్ 16 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో శిఖా పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. సులీపోర్న్ లావోమీ ఒక బంతిని ఎదుర్కొని రనౌట్ అయింది. వాంగ్‌పాకా లీంగ్‌ప్రసెర్ట్ ఏడు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి నాటౌట్‌గా నిలచింది. భారత్ బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఓవర్లలో 11 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుంది. దీప్తి శర్మ నాలుగు ఓవర్లలో 16 పరుగులిచ్చి రెండు వికెట్లు, పూజా వస్త్రాకర్ రెండు ఓవర్లలో ఐదు పరుగులు, పూనమ్ యాదవ్ మూడు ఓవర్లలో 15 పరుగులిచ్చి తలో వికెట్ సాధించారు.